తమళనాడులో ఘోర రోడ్డు ప్రమాదo
— అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణo
ప్రజా దీవెన/ తమిళనాడు: మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో అక్కడిక్కక్కడే అరుగురు మృతి చెందారు. ఈ హృదయ విధారక సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆగి ఉన్న లారీని వ్యాను ఢీకొట్టిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం తమిళనాడులో చోటు చేసుకోగా మొత్తం ఆరుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. సేలం – ఈరోడ్డు జాతీయ వెళుతుoడగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో ఈంగుర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. ఈ ప్రమాదం లో మృతులు సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతి, ఏడాది పాపగా గుర్తించారు.
సమాచారం అందుకున్న సేలం ఎస్పీ అరుణ్ కపిలన్, సంగకిరి డీఎస్పీ రాజా,తహశీల్దార్ ఇదుడై నంబి ప్రమాద స్థలాన్ని సందర్శించారు.ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్,మరో ప్రయాణికురాలు ప్రియ తీవ్రంగా గాయపడగా,వారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.