* నాంపల్లి మండల శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి
* మునుగోడు ప్రజా దీవెన (అక్టోబర్ 11)
Kathi Ravinder Reddy: నియోజకవర్గంలోని కల్వకుంట్ల గ్రామం (Kalvakuntla village)లో శుక్రవారం రోజున రూ.100 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా (Young India) ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల (Integrated residential school)కు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) శంకుస్థాపన చేయనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన సంగతి తెలిసింది. అయితే మన శాసనసభ్యులు అహర్నిశలు కృషి చేసి నియోజకవర్గంలో సుమారు 25 ఎకరాలలో రూ.100 కోట్ల వ్యయంతో పాఠశాల శంకుస్థాపన చేయడంతో నియోజకవర్గంలోని ప్రజలు ఆనందాలకు అంతులేకుండా పోయిందని నాంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు.
నాంపల్లి (Nampally) మండలంలోని గ్రామాలలో ఉన్న గ్రామ అభివృద్ధి కమిటీ మెంబర్లు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వ పథకాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలకు వివరించాలని కోరారు. శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో అందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని నాంపల్లి మర్రిగూడ మునుగోడు మండలాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా అధ్యక్షులు కామిశెట్టి చత్రపతి యాదయ్య నాంపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పానుగంటి వెంకన్న గౌడ్ గాదెపాక రాజు రామ్ శెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.