Cholesterol: మన శరీరంలోని కొలెస్ట్రాల్ అనేది అతి చిన్న టైములో కనిపించే మైనపు లాంటి పదార్థం. ఇది మెయిన్ గా మన శరీరం పని తీరుకు అవసరం. అయితే అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో అధిక స్థాయిలు హానికరం. దీనిని హైపర్ కొలెస్టెరోలేమియా అని కూడా అంటారు. దీనితో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని అధికం చేస్తాయి. మన శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో లేదా తగ్గించడంలో మనం తీసుకునే ఆహారంపై ఆధార పది ఉంది. మరి ముఖ్యంగా చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ స్థాయిని ఎక్కువగా పెరుగుతాయి.
వాస్తవానికి శీతాకాలం మన ఆరోగ్య పరంగా చాలా సవాలుగా మారుతుంది. మన ఆహారం, జీవనశైలి, జన్యుశాస్త్రంతో సహా అనేక కారణాలు కొలెస్ట్రాల్‌ను అధిక స్థాయిలో పెంచుతాయి. ఇందులో ఎక్కువగా చలి నేరుగా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం కాదు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్యను నిర్వహించడం ఈ చలికాలంలో పెద్ద సవాలు అనే చెప్పాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. ఇక శీతాకాలంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎక్కువగా పెంచుతాయి.
ఈ తరుణంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, శరీరం వెచ్చగా ఉండటానికి ఎక్కువ వేయించిన స్నాక్స్, కార్బోహైడ్రేట్-రిచ్ ఫుడ్స్ తినాలని భావిస్తుంది. ఈ ఆహారాలు చాలా వరకు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి కానీ, ప్రజలు శీతాకాలంలో వీటిని ఎక్కువగా తింటారు. అధిక కొలెస్ట్రాల్‌కు కారణమయ్యే కొన్ని ఆహార పదార్థాల ఏమిటో మనం చూద్దాం
1. చలికాలంలో నెయ్యిని (ghee)భారతీయ వంటకాల్లో ఎక్కువగా వాడుతారు. నెయ్యి ఆహారానికి రుచి, వాసనను జోడిస్తుందని నిపుణులు తెలుపుతారు . ఇది ఆరోగ్యకరమైన కొవ్వుకు (cholestral) మంచి మూలం కానీ దాని అధిక వినియోగం కొలెస్ట్రాల్‌కు మంచిది కాదంటున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం, అధిక పరిమాణంలో తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి బాగా పెరిగిపోతుంది.
2. అలాగే సాధారణంగా వెన్నను (butter) అనేక రకాల వంటలలో వాడుతారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి బాగా పెరుగుతుంది. ఇక మార్కెట్లో లభించే వెన్నలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది.
3 మన భారతీయ వంటకాలలో ముఖ్యంగా పాలక్ పనీర్(paneer), పనీర్ టిక్కా వంటి చలికాలపు వంటలలో ప్రసిద్ధి చెందినడి అనే చెప్పాలి. పనీర్ సంతృప్త కొవ్వు కూడా ఎక్కువగా ఉండడంతో కొలెస్ట్రాల్ స్థాయిలను అధిక స్థాయిలో పెంచుతుంది
4 . సాధారణంగా చలికాలంలో రెడ్ మీట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకు గల ముఖ్య కారణం వేడెక్కడం ప్రభావం. అయితే ఇందులో శాచ్యురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు వస్తాయని డాక్టర్ తెలుపుతున్నారు
5. అలాగే ఈ లిస్ట్ లోకి సమోసాలు, పకోడాలు, కచోరీలు, ఫ్రైలు, వడ వంటి వేయించిన చిరుతిళ్లు చలికాలంలో ఎక్కువగా తినకుండా ఉండాలి. కానీ వీటిలో అధిక కొవ్వు ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని బాగా పెంచుతుంది..