SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, నార్కట్ పల్లి: నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ ను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) ఆకస్మికంగా తనిఖీ చేశారు. నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ (Police Station)పరిధిలోని స్థితిగతులు గురించి యస్.ఐలను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫంక్షనల్ వర్టికల్స్ (Functional verticals) పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్ద వంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ (Community Policing)ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగా హన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హైవే వెంట ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు,రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకో వాలని అన్నారు.
అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం,అక్రమ (Cannabis, gambling, illegal)ఇసుక పి.డి.యస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోని నియంత్రించాలని అన్నా రు.ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహ రించాలని,వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పని చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట నల్లగొండ డి.యస్.పి శివ రాం రెడ్డి,చిట్యాల సి.ఐ నాగరాజు, నార్కట్ పల్లి యస్.ఐ క్రాంతి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.