రేపు ఉదయం విచారణకు హాజరుకు ఆదేశం
టీడీపీ కార్యాలయంపై దాడికి మూడేండ్లు
Sajjala Ramakrishna Reddy: ప్రజాదీవెన, మంగళగిరి: తెలుగుదేశం పార్టీ (tdp) ప్రధాన కార్యాలయంపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఇన్ని రోజులు వైసీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విచారిస్తూ వచ్చిన పోలీసులు ఇప్పుడు కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక వ్యక్తిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డికి (Sajjala Ramakrishna Reddy)మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు(గురువారం) ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
కేసు సీఐడీకి ఇచ్చాక మంగళగిరి పోలీసులు ఎందుకు నోటీసులు ఇచ్చారు?
ఇప్పటికే టీడీపీ ఆఫీస్‌పై వైసీపీ నేతల దాడి (Attack of YCP leaders) కేసును సీఐడికి ప్రభుత్వం అప్పగించింది. అయితే ఇంత వరకు సీఐడీ ఈ కేసును టేకప్ చేయలేదు. సీఐడీ కేసు విచారణ బాధ్యత తీసుకునేంత వరకు విచారణ చేస్తూనే ఉంటామంటున్నారు మంగళగిరి పోలీసులు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ కేసు దర్యాప్తును సీఐడీ ఎప్పుడు తీసుకుంటుందో అనేదానిపై క్లారిటీ లేదు.
దాడి జరిగి మూడేళ్లు..
2021 అక్టోబర్ 19న గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ (tdp) సెంట్రల్ ఆఫీస్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. వీడియో ఫుటేజ్ ఆధారంగా టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి సమయంలో వైసీపీ అధికారంలో ఉండటంతో కేసులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఒకరిద్దర్ని అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఓవైపు పోలీసు దర్యాప్తు జరుగుతుండగానే ఈ కేసు విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇంతలో మంగళగిరి పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Ramakrishna Reddy) నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారుతోంది.
అరెస్టులు- బెయిల్
ఇదే కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి (Devineni Avinash and Lella Appireddy) సహ పలువురు వైసీపీ నేతలు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఇంతలో చైతన్య అనే వైసీపీ లీడర్ ఇదే కేసులో లొంగిపోయారు. కొందరిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. వారిలో కొందరికి బెయిల్ కూడా వచ్చింది.
సుప్రీంకోర్టు రక్షణ
కేసు దర్యాప్తు వేగం చూసిన వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి లాంటి వారంతా వివిధ కోర్టుల్లో స్టేలు తెచ్చుకున్నారు. విచారణ వరకు కోర్టులు (court)అనుమతి ఇచ్చింది. అరెస్టులు లాంటివి చేయొద్దని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సజ్జల మినహా మిగతా వారంతా విచారణకు వస్తున్నారు.