Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallu Lakshmi: మహిళా హక్కుల సాధనకై అలుపెరగని పోరాటాలు

Mallu Lakshmi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఐద్వానల్లగొండ జిల్లా 13వ మహా సభలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ వెల్లడి.దేశంలో మహిళ లపై జరుగుతున్న అఘాయిత్యా లను ఎదిరించి, మహిళల హక్కుల సాధనకై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తామని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి (Mallu Lakshmi)వెల్ల డించారు. ఈరోజు స్థానిక యుటిఎ ఫ్ భవనంలో ఐద్వా నల్లగొండ జిల్లా 13వ మహాసభలుజరిగినవి. మహాసభలలో అధ్యక్ష వర్గంగా పోలేబోయిన వరలక్ష్మి జిట్టా సరోజ తుమ్మల పద్మ వ్యవహారించ్చారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి సం ఘం జెండాను ఆవిష్కరించి మహా సభలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో మనవాద ప్రభుత్వం వచ్చినప్పటినుండి మహిళలపై అనేక రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు మణిపూర్ సంఘటన మరువలేని దని ఆవేదన వ్యక్తం చేశారు. మహి ళలను గౌరవించని ఏ దేశం ముం దుకు పోదని అన్నారు మహిళల హక్కుల రక్షణకై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ (demanad) చేశారు. రోజురోజుకు ధరలు పెరిగి ప్రజలు కొనలేని తినలేని స్థితికి వెళ్తున్నారని పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆమె అన్నారు.

పేదలకు మహిళలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి నిధులు విడుదల చేయకుండా పనులు కల్పించకుండా తీవ్రమైన నష్టం ప్రజలకు చేస్తున్నారని అన్నారు ఉపాధి పనులు కల్పించినట్లయితే జీవన ప్రమాణాలలో మెరుగుదల ఏర్పడుతుందని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆరోగ్యంగా జీవించే పరిస్థితులు ఉన్నాయని కానీ ప్రభుత్వాలు వాటిని విస్మరించాయని ప్రపంచ దేశాలలో తలదించుకునే విధంగా భారతదేశం ఆకలి రాజ్యాంగ మిగులిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి మహిళకు 2500 ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి నేటికీ అమలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు పావలా వడ్డీ రుణాలు (interest loans)నేటికీ అందడం లేదని పొదుపు మహిళలను లక్షాధికారులను చేస్తామని లక్ష్యం ఏమైందని తెలిపారు కనీసం బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వలేని ప్రభుత్వం గా మిగిలిందని అన్నారు. పేదలకు రేషన్ కార్డులు పెన్షన్లు అమలు చేయాలని కోరారు. విద్యా వైద్యం అందని ద్రాక్షగా మిగిలిందని ప్రైవేటు ఆసుపత్రుల బారిన బడి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 21 22 23 తేదీలలో ఖమ్మంలో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయవలసిందిగా ప్రజానీకానికి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు వేలాదిమందిగా పాల్గొనాలని కోరారు. ఈ మహాసభలలో ఐద్వారాసర నాయకురాలు ఆశాలత పాల్గొని మాట్లాడారు. చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం గార్ల చిత్రపటాలకు పూలమాలంకరణ చేసి జోహార్లు అర్పించారు వారి ఆశయ సాధనకై పోరాడతామని ప్రతినిబూనారు.

సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి (Paladugu Prabhavati)మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని రోజురోజుకు మహిళలపై వృద్ధులపై చిన్నారులపై అగైత్యాలు పెరుగుతున్నాయని అన్నారు. అనంతరం గత మూడు సంవత్సరాలుగా సంఘం నిర్వహించిన కార్యక్రమాలు భవిష్యత్తులో సంఘం నిర్వహించవలసిన ఉద్యమాలను పోరాటాలను వివరించారు.

సంఘం నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షురాలుగా పోలేబోయిన వరలక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాలడుగు ప్రభావతి ఏకగ్రీవంగా ఎన్నిక. జిల్లా ఆఫీస్ బేరర్స్ గా జిట్టా సరోజ, కొండ అనురాధ, చనబోయిన నాగమణి, తుమ్మల పద్మ, భూతం అరుణకుమారి, నిమ్మల పద్మ, కారంపూడి ధనలక్ష్మి, పాదూరి గోవర్ధన, మేకల వర్ణ, దామెర లక్ష్మి, ఎండి. సుల్తానా ఏకగ్రీవంగా ఎన్నికైనారని 33 మందితో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నామని అన్నారు. ఈ మహాసభలలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ అధ్యక్షులు నరేష్ పాల్గొని మాట్లాడారు ప్రజానాట్యమండలి కళాకారులు చంద్రమౌళి శంకర్ బృందం పాటలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో దైదా జానకమ్మా మండల కార్యద ర్శులు ఉమా, మంజుల, పార్వ తమ్మ, నాగమణి, ఇందిరా, కౌసల్య, అరుణ ,అంజమ్మ, సాబేర, శరత్, సంధ్యా, నాగమణి భార్గవి, బొల్లోజు భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.