— రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: తమ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)అన్నారు.గ్రామీణ క్రీడాకారులలో క్రీడల పట్ల అవగా హన కల్పించి, క్రీడలను పెంపొందిం చేందుకు ఉద్దేశించి చేపట్టిన సీఎం కప్పు క్రీడలలో (CM cup sports) భాగంగా నిర్వహిస్తు న్న టార్చ్ ర్యాలీ గురువారం నల్గొం డ జిల్లా కేంద్రానికి చేరుకోగా, మంత్రి క్లాక్ టవర్ వద్ద టార్చ్ ర్యాలీ జ్యోతిని అందుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక సామర్థ్యం తో పాటు, మానసిక సామర్థ్యం పెరుగుతుందని, ప్రత్యేకించి విద్యార్థులు చదువుతోపాటు, క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. క్రీడలలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ఉంచేందుకు ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతు న్నదని, ఇందులో భాగంగా వివిధ రకాల క్రీడలలో పథకాలు పొందిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో పాటు, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకు సీఎం క్రీడా కప్ పోటీలను (CM cup sports) నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ సి .నారా యణ రెడ్డి ఈ కార్యక్ర మంలో పాల్గొని టార్చ్ ర్యాలీని అందు కున్నారు.జిల్లా ఇన్చార్జి క్రీడల అభివృద్ధి అధికారి విష్ణు గౌడ్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.