Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ola : Ola S1 Xపై దీపావళి ఆఫర్ ఇదే..!

Ola : దీపావళి పండుగ సందర్భంగా అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్ గురించి Ola Electric ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాల కస్టమర్లకు రూ.5,000 డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే ఎంపిక చేసిన కొందరు కస్టమర్లకు రూ.25,000 వరకు అదనపు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని కంపెనీ కస్టమర్స్ కు తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా….

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Ola Electric తన Ola S1 X 2KWh ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్ ఆఫర్‌ను విడుదల చేసింది. వాస్తవినికి ప్రకటించిన డిస్కౌంట్లకు సంబంధించిన Ola Electricపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో Ola స్టాక్ 3% పడిపోయిందని మీడియా కథనాలు సూచిస్తున్నాయి. దీనికి ఓలా కంపెనీ స్పందిస్తూ.. . డిస్కౌంట్ పరిమిత కాలం పండుగ ఆఫర్ అని, స్కూటర్ అధికారిక ధర మారలేదని Ola Electric అని తెలిపింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కి రాసిన లేఖలో Ola Electric డిస్కౌంట్‌ను వివరించింది. పండుగ సమయంలో అన్ని రకాల కస్టమర్లకు రూ.5,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపారు. ఎంపిక చేసిన కొందరు కస్టమర్లకు రూ.25,000 వరకు అదనపు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. స్టాక్ అయిపోయే వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఓలా స్కూటర్ కొనుక్కోవాలనుకున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది.

వాస్తవినికి Ola S1 X 2KWh రూ.49,999కి మార్కెట్ లో అమ్ముతూ ఉన్నారు. ఈ ధరలో మార్పుల గురించి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ఓలా కంపెనీని ప్రశ్నించింది. స్కూటర్ ధర మారలేదని Ola స్పందించింది. ధరను రూ.25,000 డిస్కౌంట్ ఆఫర్ గణనీయంగా తగ్గిస్తుందని, కానీ ఇది పరిమిత స్టాక్‌కు ఉన్నంత వరకేనని ARAIకి రిప్లై ఇచ్చింది. దీంతో ఓలా స్కూటర్ ధరల మార్పుపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

ఓలా స్కూటర్ ధరలో మార్పు లేదని, ప్రకటించిన గరిష్ట డిస్కౌంట్ రూ.25 వేలు మాత్రమే వర్తింపజేసినట్లుగా ఓలా రుజువు చూపింది. అక్టోబర్ 6, 2024 నాటి ఇన్‌వాయిస్‌ను Ola అందించింది. అదనపు డాక్యుమెంటేషన్ కూడా ARAIకి సమర్పించింది. వాటిని పరిశీలించిన అధికారులు ఓలా స్కూటర్ల ధరల్లో మార్పులు లేవని తెలుసుకున్నారు. .