Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

General of Civil Aviation: ఆకసాకు రూ.30 లక్షల జరిమానా

General of Civil Aviation: ప్రజాదీవెన, ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (General of Civil Aviation)రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆకాసా ఎయిర్ పలు నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. ఈ జరిమానాను ముప్పై రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది. మే 20, 2024న DGCA స్పాట్ ఇన్‌స్పెక్షన్‌ చేయడంతో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో కొన్ని లోపాలున్నాయంటూ ఆకాసా ఎయిర్‌కు ఏవియేషన్ రెగ్యులేటర్ (Aviation regulator)డీజీసీఏ గురువారం రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు17 అక్టోబర్ 2024 నాటి డిజిసిఎ ఆర్డర్‌ని మేము అంగీకరిస్తున్నాము. మేము ఈ విషయంలో రెగ్యులేటర్‌తో కలిసి పని చేస్తున్నాము అని ఎయిర్‌లైన్ (Airline)ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని శిక్షణ లోపాల కారణంగా పెనాల్టీ విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.