Village Nageswara Rao: ప్రజాదీవెన,కోదాడ:నేరసంస్కృతిని తుదముట్టించడానికి, సమాజం సమతుల్యతను సాధించటానికి పుస్తకపఠనం శక్తివంతమైన పనిముట్టుగా ఉపయోగపడుతుందని తెలంగాణ స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు (Village Nageswara Rao)అన్నారు. ప్రముఖ కవి రచయిత జూలూరు గౌరీశంకర్ (Juluru Gaurishankar)రచించిన ఆత్మకథనాత్మక దీర్ఘకావ్యం ‘‘జూలూరు పథం’’ గ్రంధాన్ని సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి జిల్లాల్లోని 94 గ్రంథాలయాలకు బహూకరించే కార్యక్రమ సభ శుక్రవారం కోదాడ పెన్షనర్స్ భవన్ లో జరిగింది. సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాణోతు బాలమ్మకు ‘‘జూలూరు పథం’’ 200 గ్రంథాలను పల్లె నాగేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం విద్వేషాల నుంచి బైటపడి శాంతివైపు పయనించాలంటే పుస్తకమే పదునైన ఆయుధమన్నారు. శాస్త్రసాంకేతిక రంగాలు ఎన్నెన్నో విప్లవాలను సృష్టిస్తున్నా వ్యక్తుల్లో సమాజంలో నైతిక విలువలను ప్రతిష్ఠించే శక్తి సాహిత్య సాంస్కృతిక రంగాలకే ఉంటుందన్నారు. పల్లె పల్లెనా గ్రంథాలయాలను ఎంతగా అభివృద్ధఇ పరిస్తే సమాజం అంతగా ప్రశాంతంగా ఉంటుందని పల్లె నాగేశ్వరరావు తెలిపారు. అంబేద్కర్ అధ్యయన జ్ఙానం (Ambedkar study knowledge)ద్వారానే తన అట్టడుగు జాతులకు విముక్తి ప్రసాదించే మార్గాలను కనుక్కొనగలిగాడని, భారత రాజ్యాంగాన్ని దేశం చేతికి అందించగలిగాడని తెలిపారు.
కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ప్రసేన్ మాట్లాడుతూ నడిగూడెం జమిందార్ నాయిన వెంకట రంగారావు (Venkata Ranga Rao, the zamindar) తెలుగు భాషాభివృద్ధికి 120 గ్రంథాలయాలను స్థాపించి, 60 గ్రంథాలను ముద్రించి తెలుగు భాషాభివృద్ధికి కృషిచేశారని గుర్తు చేశారు. అదే నడిగూడెం నుంచి వచ్చిన జూలూరు ప్రతి ఉద్యమ మలుపు దగ్గర నిలిచి 300 పుస్తకాలను తీసుకువచ్చి అస్తిత్వ ఉద్యమ సాహిత్యాన్ని వెలువరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖవైద్యులు డా. జాస్తి సుబ్బారావు, రాయపూడి చిన్ని, పారసీతయ్య, సి.హెచ్. లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవీటి రామారావు, ముత్తవరపు పాండు రంగారావు, బద్దం బద్రారెడ్డి, పందిరి నాగిరెడ్డి, పయిడిమర్రి సత్యబాబు, బంగారు నాగమణి యస్ ఆర్ కే మూర్తి, వేముల వెంకటేశ్వర్లు, పాలేటి నాగేశ్వరరావు, పుప్పాల కృష్ణమూర్తి, గంధం బంగారు, రావెళ్ళ సీతారామయ్య, యం.డి.ఖలీల్ అహ్మద్, డి.యన్.స్వామి, బొల్లు రాంబాబు, వక్కంతుల నాగార్జున, పెదనాటి వెంకటేశ్వర్లు, వేనేపల్లి శ్రీనివాసరావు, చింతలపాటి శ్రీనివాసరావు, పాకనాటి రాఘవరెడ్డి, ముత్తవరపు రామారావు, దేవబత్తిని నాగార్జున, అనంతారపు బ్రహ్మం, బడుగుల సైదులు, అర్వపల్లి శంకర్, ఉప్పల యుగంధర్ రెడ్డి, చిల్లంచర్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.