Judge Shyam Sundar: ప్రజా దీవెన,కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గా పని చేస్తున్న జడ్జి శ్యాం సుందర్ కు (Judge Shyam Sundar)ఇటీవల సీనియర్ సివిల్ జడ్జి Civil Judge) గా పదోన్నతి లభించింది. ఆయన్ను భువనగిరి లో సీనియర్ సివిల్ జడ్జి గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్బంగా ఆయన్ను శనివారం కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి మాట్లాడుతూ కోదాడలో మూడు సంవత్సరాల పాటు న్యాయమూర్తి గా పని చేసి అందరి అభిమానాన్ని చూరగొన్నారని ప్రశంసించారు. కక్షిదారులకు కౌన్సెలింగ్ చేస్తూ కేసు ల పరిష్కారంలో చొరవ చూపించారని అన్నారు.
ఆయనకు పదోన్నతి (He was promoted) లభించడం హర్షణీయం అని, భవిష్యత్తులో ఆయన మరిన్ని పదోన్నతులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు (Junior Civil Judge Bhavya, Second Class Magistrate Satyanarayana, Bar Association Vice President Gatla Narasimha Rao,), ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, కార్యవర్గం కోడూరు వెంకటేశ్వర రావు, మంద వెంకటేశ్వర్లు, హనుమంతు రాజు, హేమలత, దొడ్డ శ్రీధర్, నవీన్, సీనియర్ న్యాయవాదులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, వెజెల్ల రంగారావు, కాకర్ల వెంకటేశ్వర రావు, రామిషెట్టి రామకృష్ణ, పాలే టీ నాగేశ్వర రావు, రమజాన్ పాషా, సాధు శరత్ బాబు, తమ్మినేని హనుమంతు రావు, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.