BJP is distorting Telangana armed struggle: తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బిజెపి
--ఎన్నికల్లో వామపక్షాలతో కలిసొస్తే కాంగ్రెస్ పొత్తు --సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకటరెడ్డి
తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బిజెపి
–ఎన్నికల్లో వామపక్షాలతో కలిసొస్తే కాంగ్రెస్ పొత్తు
–సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకటరెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ: భూమికోసం, భుక్తి కోసం దొరలు భూసాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని బిజెపి మతoరంగు పులమడము సిగ్గుచేటని సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. శనివారం సిపిఐ కార్యాలయం మాగ్ధుమ్ భవనంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో పల్లా వెంకటరెడ్డి మాట్లాడారు.
తెలంగాణలో నైజాం కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తెలంగాణ అగ్ని కణంగా మారిందని గుర్తు చేశారు. భూస్వాములు జమీందారులు నిజాం తొత్తులుగా ఉండి ప్రజలను పీల్చి పిప్పి చేస్తుంటే తెలంగాణ యావత్తు సమాజం దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ అమరత్వంతో ఆనాడు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి మాగ్ధుమ్ మోహినుద్దీన్ పిలుపు మేరకు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సాగించారని వివారించారు.
నైజాoను తొత్తులుగా ఉన్నవాళ్లే ఇప్పుడు బీజేపీ ముసుగులో దీని మతం రంగు పులిమితే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. తెలంగాణలో నాలుగువేల అమరవీరుల రక్త తర్పణంతో తడిసి ముద్దయి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. ప్రపంచ చరిత్రలో లికిoచబడ్డ చరిత్రను అమీషా తో బిజెపి బహిరంగ సభ పెట్టడం చరిత్ర క్షమించదు అన్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపికి అనుకూలంగా ప్రయాణించి కమ్యూనిస్టు పార్టీలకు దూరం కావడం జరిగిoదని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అస్థిర పరిచే భాగంగా బిజెపి ప్రయత్నం చేస్తే సిపిఐ సిపిఎం కలిసి బిజెపిని ఓడిస్తే నేడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి లొంగిపోవడం ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేసారు.
కమ్యూనిస్టులు ఒంటరి వారు కాదని, తాత్కాలికంగా దెబ్బతిన్న ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి లాంటి పథకాలు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకు నాయకులకే చెందుతున్నాయని విమర్శించారు.
అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకపోతే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను గ్రామాలలో రానివ్వకుండా ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని దీనిపై ప్రభుత్వం రైతులకు కావలసిన ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతంగా సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా 11వ తేదిన నల్లగొండ జిల్లాలో చిట్యాల మండలం గుండ్రాoపల్లి అమరవీరుల స్థూపం వద్ద సాయుధ పోరాటం వారోత్సవాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
సెప్టెంబర్ 17న హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తల్లిని రావాలని పిలుపునిచ్చారు.
సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు గురిజ రామచంద్రం అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి లోడింగి శ్రవణ్ కుమార్, ఉజ్జని యాదగిరిరావు, బొడ్డుపల్లి వెంకట్ రమణ, బంటు వెంకటేశ్వర్లు బోల్గురి నరసింహ,తిర్పారి వెంకటేశ్వర్లు, ఆర్ అంజ చారి, పబ్బు వీరస్వామి నల్పరాజు రామలింగయ్యలు పాల్గొన్నారు.