Minister who initiated Krishna Gokulam: కృష్ణ గోకులం ప్రారంభిoచిన మంత్రి
-- చింతపల్లి సాయిబాబా మందిరంలో
కృష్ణ గోకులం ప్రారంభిoచిన మంత్రి
— చింతపల్లి సాయిబాబా మందిరంలో
ప్రజా దీవెన/నల్లగొండ: గోమాతను, మానవజాతిని సంరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయి సన్నిధి సాయిబాబా దేవాలయంలో శ్రీ కృష్ణ గోకులం (గోశాల) ను ప్రారంభించారు.
శనివారం చింతపల్లి మండలంలో నీ సాయిబాబా దేవాలయానికి కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని శ్రీ సాయి సన్నిధి సాయిబాబా దేవాలయంలో. శ్రీ కృష్ణ గోకులం (గోశాల) ను ప్రారంభించి సతీ సమేతంగా గోమాతకు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, దేవరకొండ ఎమ్మేల్యే రమావత్ రవీంద్ర కుమార్, మునుగోడు ఎమ్మేల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గోశాల ఆవరణలో నిర్వహించిన హోమం లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమంలో పాల్గోన్నారు. గోశాల ప్రారంభోత్సవం సందర్బంగా గోశాల ప్రాంగణంలో నిర్వహించిన రుక్మిణీ కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా గోవును పెంచుకుంటూ గోవును పూజిస్తూ ఉన్నారు. గోవులు లేని చోట గోవులను దిగుమతి చేసుకుని గోవును సంరక్షిస్తూ ఉన్న పరిస్థితిని మనందరం చూస్తున్నాము. మంత్రి గోమాత విశిష్టతను గొప్పగా వివరించారు. సాయిబాబా ఆలయం, గోశాల ఏర్పాటు చేసి ఇంత మంచి వాతావరణం కోసం తపన పడుతున్న ఆలయ కమిటీ సభ్యులను, సహకరిస్తున్న వారికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అర్చకులు, ఆలయకమిటీ చైర్మన్ మంచి కంటి దనంజయ, తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో పాటు దేవరకొండ ఎమ్మేల్యే రమావత్ రవీంద్ర కుమార్, మునుగోడు ఎమ్మేల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.