–ఈ నెల 27వ తేదీ వరకు వరుస పరీక్షలు
–31,383 మంది అభ్యర్థులు, 46 పరీక్షా కేంద్రాలు
–కేంద్రానికి కనీసం అరగంట ముం దు వెళ్లాలి
— అభ్యర్థులు విధిగా అన్ని పరీ క్షలూ రాయాల్సిందే
–పటిష్ఠ బందోబస్తు, సీసీటీవీ కెమె రాల ఏర్పాటు
Group-1 Exam: ప్రజా దీవెన, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ (Group-1 Exam)పరీక్షలు సోమ వారం ప్రారంభం కాను న్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఇంగ్లిష్ (క్వాలిఫై టెస్ట్) పరీక్ష, తర్వాత వరుసగా సబ్జె క్టు పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్షల కు అధికారులు (Officers)పూర్తిస్థాయి ఏర్పా ట్లు చేశారు. ఒకపక్క ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. ఈ పరీక్షలకు 31,383 మంది అభ్య ర్థులు హాజరుకానున్నారు. 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ జిల్లాలో 27 ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు నేరుగా పర్యవేక్షించ నున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు, అవాంఛ నీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రతి పరీక్షా హాలు, చీఫ్ సూపరింటెం డెంట్ రూమ్ (Chief Superintendent Dent Room), పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. వీటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులు పర్యవే క్షించనున్నారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రానికి ( examination centre)చేరు కోవాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల్లోకి మధ్యాహ్నం 12.30 నుంచి 1.30గంట వరకు అనుమతిస్తా మని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబం ధించి ఏమైనా అనుమానాలు ఉంటే 040–23452185, 040–23452186, 040–23452187నంబర్లలో కానీ, ఈ–మెయిల్ ద్వారా కానీ సంప్ర దించవచ్చని అధికారులు సూచిం చారు. దివ్యాంగులకు గంట సమ యం అదనంగా కేటాయిస్తున్నారు. సహాయకులసాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా 4కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, పరీక్షా హాళ్లలో గోడ గడియారాలు (Wall clocks) ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్స్‌లో అభ్యర్థులు అన్ని పరీక్షలూ రాయా ల్సి ఉంటుంది. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్, ప్రశ్నపత్రాలు భద్ర పరచుకోవాల్సి ఉంటుంది. 563గ్రూపు–1 పోస్టులను భర్తీలో భాగంగా.. ఇప్పటికే ప్రిలిమనరీ పరీక్షలు పూర్తి చేసి, మెయిన్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశా రు. ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు.