Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prime Minister Modi: పరివార్ వాదంతో దేశానికి ముప్పు

వారాణసిలో పర్యటనలో ప్రధాని మోదీ

Prime Minister Modi: ప్రజా దీవెన, వారాణసి: దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ( politics of family succession) ఉండడం మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందువల్ల రాజకీయ నేపథ్యంలేని కుటుంబా లకు చెందిన యువత రాజకీయా ల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ‘రాజకీయ వంశాలు’ దేశ యువతకు నష్టం కలిగించాయని విమర్శిం చారు. ఆదివారం వారాణసిలో కంచిపీఠం నెలకొల్పిన ఆర్‌జే శంకర నేత్ర వైద్యశాలను (Eye Hospital) ప్రారంభించ డంతో పాటు, రూ.6,700 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిం చారు. ‘‘పరివార్‌వాదులతో దేశానికి పెద్ద ముప్పు ఉంది. యువతకు అవ కాశాలు ఇవ్వడంలో వారికి నమ్మకం లేదు. అందువల్లనే రాజకీ య నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన లక్ష మంది యువత రాజకీ యాల్లో పాల్గొనాలని ఎర్రకోట నుం చి పిలుపునిచ్చాను. దేశ రాజకీ యాలను మార్చేందుకు, అవినీతి ని, పరివార్‌వాద సిద్ధాంతాన్ని నిర్మూలించేందుకు దీన్ని ఉద్య మంలా చేపట్టాలి’’ అని అన్నారు.

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు (Congress and Samajwadi parties)ఆశ్రిత పక్షపాతాన్ని పోషిస్తున్నా యని విమర్శించారు. గతంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు పత్రికల్లో పతాక శీర్షికలుగా ఉండే వని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. కాగా, ఈ సమావేశంలో కంచి కామకోటి పీఠం శంకరాచార్య జగద్గురు విజయేంద్ర సరస్వతి స్వామి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ, ఎన్‌డీఏలను దేవుడు అనుగ్ర హించాడని అన్నారు. ఎన్‌డీఏ అంటే ‘నరేంద్ర దామోదర్‌దాస్‌ కా అనుశాసన్‌’ (నరేంద్ర దామోదర్‌ దాస్‌ పరిపాలన) అని అభివర్ణిం చారు. తొలుత సంస్కృతంలో ప్రసంగాన్ని ప్రారంభించిన శంకరా చార్య మోదీ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. అందరి సంక్షేమానికి కృషి చేస్తూ ప్రపంచంలోనే ఆదర్శ ప్రభుత్వంగా ఉంటోందని చెప్పారు. ఇటీవలి కశ్మీర్‌ ఎన్నికల (Kashmir Elections) ఫలితా లను కూడా ప్రశంసించారు. తనకు ప్రధాని మోదీతో చిరకాలంగా అను బంధం ఉందని చెప్పారు. కోయం బత్తూరులో తొలుత నేత్ర వైద్యశా లను ప్రారంభించామని, ఇది 17వదని చెప్పారు. ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన వారాణ సిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, విమానా శ్రయంలో కొత్త టెర్మినల్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఆగ్రా, బగ్‌డో గ్రా, రేవా, అంబికాపూర్‌, సార్‌సావా విమానాశ్రయాల పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు.