Panuganti Mahesh Goud: మునుగోడు ప్రజా దీవెన అక్టోబర్ 21. రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలను (Cotton buying centres) ఏర్పాటు చేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు పానుగంటి మహేష్ గౌడ్ (Panuganti Mahesh Goud) అన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజా దీవెనతో మాట్లాడుతూ రైతులు నిరంతరం శ్రమించి అదృష్టం అనావృష్టి కారణాలతో ఇబ్బందులు పడుతూ పత్తి పంటను పండిస్తే దళారుల చేతుల్లో తక్కువ ధరలకు మోసపోతున్నారని అన్నారు చేతికి అందిన పంట మార్కెట్లో అమ్మే సమయంలో గిట్టుబాటు తరలేకపోక పండించిన పంటను భద్రపరిచే అవకాశం లేకపోవడంతో తప్పని తప్పని పరిస్థితిలో అనేక పెట్టుబడులు పెట్టి పంటను పండించి పంటను నిలువ చేసుకునే సామర్థ్యం లేక పంటను దళారులకు. అమ్మవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం గుర్తించి దళారి వ్యవస్థను పూర్తిగా కట్టడి చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా (Telangana state wide) పత్తి కొనుగోలు కేంద్రాల (Cotton buying centres)ను ఏర్పాటు చేసి రైతు పండించిన పంటను ఆత్మ గౌరవంగా అమ్ముకునే విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాలని కోరారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.