Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cinnamon Benefits: దాల్చిన చెక్కతో లాభాలు ఏమిటంటే..?

Cinnamon Benefits: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఊబకాయం ఆరోగ్య సమస్యతో భాద పడుతూ ఉన్నారు. ఈ సమస్యకు సాధారణంగా బరువు పెరగడానికి.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడమే ముఖ్య కారణాలు. ఈ క్రమంలో బరువుతో పాటు పొట్టలో కొవ్వు కూడా బాగా పెరిగి పోతుంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ అసహ్యంగా కనిపిస్తుంది. అలాగే దీని వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు కూడా వస్తాయి అన్న మాటలో ఎటువంటి సందేహం లేదు. ఇలా ఒక వైపు బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే.. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే, పొట్ట కొవ్వును వేగంగా తగ్గించడంలో మనకి బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం పూట ఈ వస్తువును తినడం ద్వారా, మీరు చాలా తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాలను మనం పొందవచ్చు. ఇంతకీ.. ఆ వస్తువు, దాని ప్రయోజనాలు మనం ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా దాల్చిన చెక్కతో (Cinnamon) స్థూలకాయాన్ని, ముఖ్యంగా పొట్ట కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చని డాక్టర్లు తెలియ చేస్తున్నారు. దాల్చిన చెక్క దాదాపు మన ప్రతి భారతీయ ఇంటిలో కనిపించే సుగంధ ద్రవ్యం. ఇందులో అనేక మంచి లక్షణాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడంలో బాగా సహాయపడతాయి. ఇది తినడం వల్ల ఆహార కోరికలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా మీకు తరచుగా ఆకలి అనిపించదు. అంతేకాకుండా.. చక్కెర కోరికలు కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాల్చినచెక్క తినడం ద్వారా ఎక్కువగా స్వీట్లు తినడానికి కూడా మక్కువ చూపారు. దీంతో.. బరువు తగ్గడంలో ప్రభావ వంతంగా ఉంటుంది. వీటన్నింటితో పాటు.. దాల్చినచెక్క (Cinnamon) తీసుకోవడం వల్ల జీవక్రియను పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వాస్తవానికి ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో బాగా సహాయపడుతుంది. కనుక చాల సులువుగా బరువు తగ్గాడనికి వీలు ఉంటుంది.

అలాగే దాల్చినచెక్కను పొట్టలో కొవ్వు, ఊబకాయాన్ని (Fat, obesity)తగ్గించడానికి అనేక విధాలుగా మనం తీసుకోవచ్చు. దాల్చిన చెక్క నీరు కూడా త్రాగవచ్చు. అందు కోసం.. మనం ముందుగా దాల్చిన చెక్క ముక్కను ఒక గ్లాసు నీటిలో బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గినప్పుడు, ప్రతి రోజూ ఖాళీ కడుపుతో ఈ నీళ్లను గోరువెచ్చగా తాగండి. అలాగే దాల్చినచెక్క నుండి హెర్బల్ టీ లాగా కూడా తయారు చేసి కూడా త్రాగవచ్చు. ఇందు మనం ఒక గ్లాసు నీరు(water) మరిగేలా ఉంచండి. నీళ్లు కాస్త వేడి అయ్యాక దాల్చిన చెక్క ముక్క, అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత.. చిటికెడు పసుపు (tumeric) పొడిని వేస్తె సరి.. హెర్బల్ టీ రెడీ అయిపోతుంది. ఇలా క్రమంగా తాగడం వలన అతి తక్కువ సమయంలో అనేక ఫలితాలను మనం పొందవచ్చు.