RGV- Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి గురించి ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి చాలా రోజుల అనంతరం షూట్ లో అడుగు పెట్టాడు. ఈ క్రమంలో SSMB ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి బయట ఎక్కువ కనిపించడం లేరు. ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ నాడు కనిపించిన రాజమౌళి (Rajamouli) మల్లి ఎక్కడ కూడా కనిపించలేదు. తాజా నివేదికల ప్రకారం.. రాజమౌళి ఒకప్పటి ఇండియన్ సెన్సేషన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయితే ఇది సినిమా కోసం కాదు. వీరిద్దరూ కలిసి ఓ టాక్ షోలో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా ఇప్పటికి టాక్ షోస్ (talk shows) కు మంచి ఆదరణ లభిస్తోంది. ఆహా లో ప్రసారమయ్యే బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. అదే లిస్టులోకి అతి త్వరలో ఈటీవి(etv) ఓటీటీ కోసం ఓ స్టార్ హీరోతో టాక్ షో ప్లానింగ్ లో ఉన్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ ఓ టాక్ షో ను ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఈ టాక్ షో కు హోస్ట్ గా దగ్గుబాటి రానా వహిస్తున్నారట. ఈ టాక్ షో కి సంబంధించి దాదాపు అంతా సెట్ అయిందని సమాచారం. ఫస్ట్ గెస్ట్ గా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఏ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ షో కి రెండవ ఎపిసోడ్ కోసం యంగ్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల (Naga Chaitanya and Shobhita Dhulipalla) రాబోతున్నట్టు సమాచారం, అదే జరిగితే ఈ టాక్ షో సూపర్ హిట్ సొంతం చేసుకుంటుంది అని సినీ వర్గాల నుంచి సమాచారం. అతి త్వరలోనే ఈ టాక్ షో కి సంబంధించి పూర్తి వివరాలు వెల్డించబోతున్నటు సమాచారం.. చూడాలి మరి ఈ టాక్ షో ఎలాంటి విజయం సొంతం చేసుకుంటుందో అని.