బ్రేకింగ్….
చంద్రబాబుకు 14రోజుల కస్టడీ
ప్రజా దీవెన/విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోర్టు 14 రోజుల జ్యూడిషల్ విధిస్తూ తీర్పు చెప్పింది. విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 23 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడం విశేషం. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయoగా పెను ప్రకంపనులు సృష్టించే అవకాశం లేకపోలేదు. ఇది ఇలా ఉండగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎదురుదెబ్బ తగిలినట్టే. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బృందం, ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల బృందం సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు తీర్పునిచ్చారు. చంద్రబాబుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్ట్ తీర్పునిచ్చింది. దీంతో చంద్రబాబును రాజమండి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. రిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు లాయర్లు మరికాసేపట్లో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. రూ.271 కోట్ల స్కామ్ జరిగిందని, అందులో చంద్రబాబు పాత్ర ఉందని పేర్కొంది. కాగా.. అరెస్ట్ విషయంలో సుమారు 8 గంటలపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం చంద్రబాబుకు జుడీషియల్ రిమాండ్ విజయవాడ ఏసీబీ కోర్ట్ తీర్పునిచ్చింది.