Children’s Heart Attack: నేటి దైనందిత జీవితంలో వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరూ హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అవును, ఒకప్పుడు ఎప్పుడో వయసు మీదపడిన ఆరవై ఏళ్ల తర్వాత హార్ట్ ఎటాక్స్ (Heart Attack) వంటివి వచ్చేవి. ఇప్పుడు అభం శుభం ఎరుగని పిల్లలపై కూడా హార్ట్ ఎటాక్ దాడి చేస్తుంది. దీంతో పిల్లల్లో గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గతి తప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల వత్తిళ్లు అని ఆరోగ్య నిపుణులు (Health professionals)తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. అందుకే సమయానికి మేల్కొనకపోతే, లేత వయస్సులోనే పెనుప్రమాదాలు ముంచుకొస్తాయని అంటున్నారు. చిన్న వయసులోనే పిల్లల్లో గుండెపోటు ఎందుకు వస్తుందో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం!
కార్డియాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. నేటి కాలంలో పిల్లలు శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నారని గుర్తించారు. మరీ ముఖ్యంగా ఇప్పటి పిల్లలను ఫాస్ట్ ఫుడ్ (Fast food)సంస్కృతిలో తల్లిదండ్రులు పెంచుతున్నారని చెబుతున్నారు. ఇదే కాకుండా చదువుపై ఒత్తిడి కూడా నానాటికీ పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి అని సూచిస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలు (chidrens) ఆటలు ఆడటం పూర్తిగా మనేశారు. ఇళ్లలోనే కూర్చుని ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ కాలం గడిపేస్తున్నారు. దీంతో పిల్లల్లో శారీరక శ్రమ అనేది పూర్తిగా కనుమరుగైంది. అందువల్లనే పిల్లలు గుండెపోటుకు గురవుతున్నారు… అని తెలియపరుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటి తల్లులు చాలా మంది పోషకాహారం చేయడానికి బదులుగా 2 నిమిషాల్లో అల్పాహారం తయారు చేసి పిల్లలకి పెడుతున్నారు. తద్వారా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
అయితే, గుండెపోటు (Heart Attack) నుండి పిల్లలను రక్షించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా అవసరం. చిన్నపిల్లల పట్ల నిర్లక్ష్యం వహించడం పెద్ద సమస్యగా మారుతుంది. పిల్లల్లో స్థూలకాయం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని తెలుసుకోవాలి. అందుకే జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. నేటి పోటీ సమాజంలో విద్యపై అధిక ఒత్తిడి ఉంది. అందుకే తల్లిదండ్రులు ఇది గమనించి ఆ వత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఒత్తిడిని తగ్గించడానికి వారిని ఆరుబయట హాయిగా ఆడుకోనివ్వాలి. ఆహారంపై అధిక శ్రద్ధ వహించాలి. ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా మానుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడప్పుడూ పిల్లల బీపీని చెక్ చేస్తూ ఉండాలి. పిల్లలు లావుగా ఉంటే, కొవ్వు (fat)కరగడానికి వ్యాయామ సహాయం తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.