Huge explosions: ప్రజా దీవెన, జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordnance Factory) ఖమారియాలోని ఎఫ్6 సెక్షన్‌లో మంగళవారం ఉదయం భారీ పేలుడు (Huge explosion) సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, దాదాపు డజను మంది ఉద్యోగులకు కాలిన గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారి ని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బాంబు నింపే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఫ్యా క్టరీలోని ఎఫ్-6 విభాగంలో బాంబు నింపే పని జరుగుతుండగా ఒక్క సారిగా హైడ్రాలిక్ సిస్టమ్ పేలింది.
పేలుడు శబ్దం చాలా పెద్దగా విన పడింది. దాని శబ్దం ఐదు కిలోమీ టర్ల వరకు వినబడింది. ఘటనా నంతరం, గాయపడిన ఉద్యోగుల ను ఆసుపత్రికి తరలించారు. అక్క డ తీవ్రంగా గాయపడిన రణధీర్, శ్యామ్‌లాల్, చందన్ లను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక పేలు డు ఎలా జరిగింది ఎవరి నిర్లక్ష్యమే కారణమన్న దానిపై కేంద్ర ప్రభు త్వం (Central Govt) విచారణకు ఆదేశించింది.