MD Salim: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అర్హు లైన పేదలందరికీ ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఇండ్లు, ఇళ్ల స్థలా లు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం (MD Salim) అన్నారు. మంగళవారం సుందరయ్య భవన్ లో సిపిఎం పట్టణ కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సలీం మాట్లాడుతూ గత నెల రోజులుగా నల్గొండ పట్టణంలోని 20 శాఖల మహాసభలు నిర్వహిం చుకుని ఆదివారం నల్గొండ పట్టణ మహాసభ (Mahasabha) ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ మహాసభ లో నల్గొండ పట్టణంలో ఎదుర్కొం టున్న ప్రజా సమస్యలను గుర్తించి పలు తీర్మానాలు చేసి పోరాటాల కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. నల్లగొండ పట్టణంలో ఇండ్లు లేని పేదలు వేలాదిమంది ఉన్నారని ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాలు స్థలం ఇచ్చి ,కేంద్రం ఐదు లక్షలు, రాష్ట్ర 5 లక్షలు మొత్తం పది లక్షలు రూపాయలు ఇంటి నిర్మాణానికి (House construction) ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. 1994 లో సిపిఎం ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి ఉన్న కాలంలో పేదలకు అనేక కాలనీలు నిర్మించారని గుర్తు చేశారు .ఆ తర్వాత ఇండ్లు కానీ, ఇంటి స్థలం కానీ ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
తక్షణమే పట్టణంలో నిర్మించిన 552 ఇండ్లకు మౌలిక సదుపాయాలు (Infrastructure) కల్పించి లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. నలగొండ పట్టణం నడిమధ్య నుండి వెళుతున్న 565 జాతీయ రహదారి నిర్మాణం ఆప్షన్ త్రి రద్దుచేసి ఒకటి లేదా రెండు ఆప్షన్స్ ప్రకారం నిర్మాణం చేసి పట్టణ విస్తరణ మరియు అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. జిల్లా కేంద్రం లో ఉన్న పానగల్లును లతీఫ్ సాబ్(Latif saab) గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తగిన నిధులు కేటాయించాలని కోరారు. పట్టణంలో అసంఘటిత కార్మికుల కు పనుల కోసం అడ్డాలు ఏర్పాటుచేసి, మౌలిక సదుపాయాలు కల్పించాలని, పట్టణంలోని నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాల కోసం ఐటీ టవర్ కు అధిక కంపెనీలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలీన పంచాయితీలలో అభివృద్ధికి నోచుకోలేదని ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరింపచేసి పేదలకు పని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రభుత్వ విద్య వైద్యం పేదలకు (Education and medicine for the poor)అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (Health centers) మౌలిక సదుపాయాలు కల్పించి అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. పట్టణంలో ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మహాసభలో తీర్మానాలు చేశామని ఉద్యమాలకు తగిన ప్రణాళికల రూపొందించుకున్నామని తెలిపారు. నూతనంగా నల్లగొండ పట్టణ కార్యదర్శి గా దండంపల్లి సత్తయ్య తో పాటు మరో 19 మంది పట్టణ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆయన తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, అద్దంకి నరసింహ, గాదె నరసింహ, పాక లింగయ్య, గంజి నాగరాజు ,కోట్ల అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.