— ఎంపీ ఈటెల రాజేందర్ ధ్వజం
Etela Rajender: ప్రజా దీవెన, హైదరాబాద్: హిందూ ప్రజలు, సంస్థలు యావత్ హిందూ సమాజం పట్ల తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిలో ( Revanth Reddy) ధ్వేషభావం కొట్టొచ్చినట్లు కనబడుతోందని మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యు డు ఈటెల రాజేందర్ (Etela Rajender) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీది ఒకటే కల్చర్ అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మత విద్వే షాలు సృష్టించే వారిని ఏనాడు నియంత్రించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) హయాంలో మతో న్మాదులకు షెల్టర్ ఇస్తూ వారిని పెం చి పోషిస్తున్నా నియంత్రించే ప్రయ త్నం చేయని సంఘటనలు గతం లో కోకోల్లలుగా వెలుగు చూసాయ ని వెల్లడించారు. హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు.
హిందూ ఆలయాలపై (Hindu temples) దాడులకు పాల్పడిన విషయంలో ప్రశ్నిస్తున్న వారిపై సంఘవిద్రోహశక్తులుగా, మతోన్మాదులుగా, దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రె స్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రా ల్లో ముఖ్యమంత్రులను మార్చాలన్నా కూడా మత కలహాలు సృష్టిం చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. 1978లో రమీజా బీ హత్య కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తీరుతో హైదరా బాద్ నగరంలో మత కలహాలు చెలరేగాయని, హైదరాబాద్లో మంటలు చెలరేగి, అల్లర్లు జరి గాయని, వందల మంది ప్రాణాలు పోయాయని విచారం వ్యక్తం చేశా రు. 1982-83 సంవత్సర కాలం లోనూ కాంగ్రెస్ పార్టీ మత కల హాలు సృష్టించి వందల మందిని బలిపెట్టిందని, వారి శవాలమీద రాజకీయం చేసిందని దుయ్య బట్టారు.
2014 కు ముందు ప్రపం చ వ్యాప్తంగా సిరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్ (Syria, Bangladesh, Pakistan, India) ఇలా అనేక చోట్ల టెర్రరిస్టులు జిహాదీల పేరిట రక్తాన్ని ఏరులుగా పారించిందని అన్నారు. జమ్ము కశ్మీర్ లో భారత సైనికుల మీద రాళ్ల వర్షం కురిసినప్పుడు, సైన్యం ట్రక్కుల మీద బాంబులు పేలినప్పుడు ఆ మారణహోమాన్ని చూసి ప్రజలు ఏడ్చారని, తెలంగా ణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చాలాచోట్ల ఉన్మాదంతో జిహాదీ పేరుతో బాంబు దాడులకు (Bomb attacks) పాల్ప డిన ఘటనలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. 2002 నవంబర్ 21వ తేదీన దిల్షుక్నగర్లోని సాయిబాబ దేవాలయం వద్ద పేలు డు సంభవించిందని, 2004 నవం బర్ 1న సరూర్నగర్ దగ్గర కాలేజీ బస్సు కింద బాంబు పేలి, ప్రజలు గాయపడ్డారని వివరించారు.
2004 నవంబర్ 12న జామే ఉస్మానియా సమీపంలోని రైల్వే ట్రాక్ (Railway track) పక్కన బాంబు పేలుడు సంఘటన చోటు చేసుకుందని, 2007 మే 18న పాతబస్తీ మక్కా మసీదులో బాంబులు పేలి 14 మంది చనిపోయి, చాలా మంది గాయపడ్డారని వివరించారు. 20 07 ఆగస్టు 25వ తేదీన లుంబినీ పార్కు, కోఠీలోని గోకుల్ చాట్ల్లో సంభవించిన పేలుళ్లలో 42 మంది మరణించారని, వందల మంది గా యాలపాలయ్యారని, 2002 నవం బర్ 21వ తేదీన దిల్షుక్నగర్లోని సాయిబాబ దేవాలయం వద్ద పేలు డు సంభవించిందని వెల్లడించారు. తెలంగాణలో పదేళ్ల పాటు అధికా రంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో మత కలహాలతో జరిగిన దాడుల్లో వందల మంది చనిపోయారని, అలాంటి భయానక పరిస్థితుల తర్వాత ఏ షాపుకెళ్లినా, జనసమ ర్థంగా ఉన్న ప్రాంతాలకు మెటల్ డిటెక్టర్లు లేకుంటే అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ, సమాజాన్ని అస్థిరపర్చే టెర్రిరిస్టు లమీద ఉక్కుపాదం మోపిందని, జమ్ము కశ్మీర్ వైపు పరాయి దేశం కన్నెత్తి చూడకుండా, ప్రశాంతత నెలకొల్పిన ప్రభుత్వం బిజెపి, టెర్ర రిస్టులపై ఉక్కు సంకల్పంతో ఉక్కు పాదం మోపిన నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల రాజకీయం కోసం మత కలహాలు సృష్టించే వారిని పట్టుకోలేక, నియంత్రించే దమ్ము లేక, దాడులకు వ్యతిరేకంగా శాం తియుతంగా నిరసన తెలిపిన వారి పై హత్యా కేసులు పెట్టించి, బిజెపి (bjp) నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
ఇటువంటి వైఖరి తగదని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తుంచు కోవాలని హెచ్చరించారు. తెలం గాణలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని, టెర్రిస్టులకు అడ్డాగా మారిందని, రోహింగ్యాలు అక్రమంగా వలస వస్తున్నారని కేంద్ర ఏజెన్సీలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను నివారించలేకపోతోందని ఆరో పించారు. ఇతర రాష్ట్రాల నుంచి పోలీసులు తెలంగాణకు వచ్చి టెర్రి స్టులను పట్టుకున్న ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. సికిం ద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై (Secunderabad Mutyalamma Temple) దాడి ఘటన తర్వాత హిందూ ప్రజానీకం ఆత్మగౌరవాన్ని, సంస్కృ తిని, సంప్రదాయాన్ని కించపర్చే ప్రసంగాలు చేస్తున్నది ఎవరో తేలి పోయిందని, హిందూ సమాజంపై ధ్వేషాన్ని, విషాన్ని కక్కుతూ, ప్రజ ల్లో ధ్వేషభావాన్ని రెచ్చగొట్టే దుర్మా ర్గమైన వ్యక్తులను కట్టడి చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో సంఘ విద్రోహ శక్తుల కుట్రలను నిగ్గు తేల్చాలని డిమాండ్ (demand)చేశారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం హిందూ ప్రజల ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని కాపాడటంలో విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఎంఐఎం పార్టీ మెప్పు కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం, సమాజ హితం (Community interest) కోసం పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలు గుతున్నందునే భారతీయ జనతా పార్టీ పోరాడుతున్నదని,అన్ని మ తాలను సమానంగా చూసే దేశం భారతదేశమని, బాంబు బ్లాస్టు లను, దుర్మార్గపు హత్యలను, రక్తపాతాన్ని ఏ మతపెద్దలూ హర్షిం చరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలి కారు. బిజెపి నాయకులు, కార్య కర్తల అరెస్టులను తీవ్రంగా ఖండి స్తున్నామని, వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయడంతో పా టు కేసులను విత్ డ్రా చేసుకో వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేస్తున్నామన్నారు.
బిజెపి నాయకుల ఇండ్లలోకి వెళ్లి పోలీసులు వేధించాలని చూస్తే సహించేది లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల హక్కులను ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని హరించి, ప్రతిపక్షాలను అణిచి వేయాలనే ప్రయత్నం చేశారని,నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టు లతో అణచివేయాలను కోవడం దుర్మార్గ చర్యగా ఆయన అభి వర్ణించారు.