సంతోషం.. అంతలోనే విషాదం
— ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు దుర్మరణం
ప్రజా దీవెన/ సూర్యాపేట: వనవాస కార్యక్రమాన్ని ముగించుకొని సంతోషంగా ఇంటికి చేరుకుందామనుకున్న వారికి విషాదం ఎదురైంది.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామ శివారులో ట్రాక్టర్ టక్కు బోల్తా పడి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద స్థలిలోనే ఇద్దరు మహిళలు బిల్లా మనిషా, చంద్రమ్మ లు మృత్యువాత పడ్డారు.
మిగిలిన మరో ఇద్దరికీ గాయాలు కాగా హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలిoచారు. ప్రమాదo జరిగిన సమయంలో ట్రాక్టర్ ట్రక్కులో 15 మంది వరకు ఉన్నట్లు తెలుస్తొంది. ముత్యాలమ్మ పండుగలో భాగంగా వనవాసయాత్ర ముగించుకుని సంతోషంగా ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరుగడంతో విషాదం నెలకొంది.