Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fake Court: మోసాలకే మోసగాడు….నకిలీ కోర్టుతో జడ్జిగా అవతారo

Fake Court: ప్రజా దీవెన, గుజరాత్:ఇది మోసా లకే మోసం. ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ట్రైబ్యునల్‌నే ఏర్పాటు చేసి తీర్పు లు కూడా ఇచ్చేశాడు. గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) జరిగిందీ విచిత్ర విశేషాల ఘటన. కోర్టు తనను ఆర్బిట్రేటర్‌గా నియమిం చిందని చెబుతూ నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ గాంధీనగర్‌లోని తన కార్యాల యాన్ని కోర్టు రూముగా మార్చే శాడు. 2019లో ఓ ప్రభుత్వ భూ మికి సంబంధించిన కేసులో తన క్లయింట్‌కు అనుకూలంగా తీర్పు నిచ్చి ఆదేశాలు జారీచేశాడు.

అయితే, అవి నకిలీ (fake)ఆదేశాలని గుర్తించిన అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ కోర్టు బాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రస్తుతం కటకటాలు లెక్కపెట్టుకుం టున్నాడు. ఐదేళ్లుగా అతడు ఇలా తీర్పులు ఇస్తున్నట్టు గుర్తించారు.

సివిల్ కోర్టులో (Civil Court) పెండింగ్‌ కేసులున్న వారిని గుర్తించి వాటిని త్వరగా పరిష్కరిస్తానని నిందితుడు తన కోర్టుకు రప్పించుకునేవాడు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పులిస్తూ పెద్దమొత్తంలో డబ్బు లు వసూలు చేసేవాడని విచా రణలో తేలింది. తనది నిజమైన కోర్టుగా నమ్మించేందుకు తన అనుచరులను కోర్టు (court) సిబ్బందిగా ఉపయోగించుకున్నట్టు పోలీసులు తెలిపారు.