— వ్యవ సాయశాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు
Tummala Nageswara Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆయిల్ పామ్ విస్తరణవకాశాలు మరియు ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహ ణ, సాగులో అనుసరిస్తున్న సాంకే తిక విధానాలు, ఆయిల్ పామ్ ఉ త్పాదకాలు మున్నగువాటి గురిం చి శాస్త్రీయ అధ్యాయానికి వ్యవ సాయశాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు (Tummala Nageswara Rao) వ్యవసాయశాఖ కార్య దర్శి రఘునందన్ రావు, డైరెక్టర్, ఉద్యానశాఖ మరియు ఎండీ ఆయిల్ ఫెడ్ యాస్మిన్ బాషా వారి బృందం మలేషియా పర్యటనలో భాగంగా మంగళవారంమలేషియా ప్లాంటేషన్ మరియు కమో డిటీస్ మంత్రి వర్యలు జోహరి అబ్దుల్ (Johari Abdul) ఘనిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ తెలంగాణ ప్రభు త్వము ఆయిల్ పామ్ సాగుకోసం అందిస్తున్న ప్రోత్సహకాలు, ప్రస్తుత పరిస్థితి మరియు రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్దికి గల అవకాశాలు వివరించి, ఆయిల్ పామ్ (Oil palm) సాగులో అగ్రగామి దేశాల లో ఒకటిగా ఉన్న మలేషియా నుంచి సహకారం అందించగలరని కోరారు. మలేషియా మంత్రి మా ట్లాడుతూ 143 కోట్ల జనాభా గల దేశానికి ఆహారం అందించడం చాలా గొప్ప విషయమని, ప్రపంచ దేశాలు అన్నీ భారతదేశం ఆ దిశ లో అవలంబిస్తున్న విధివిధా నాల ను చూసి నేర్చుకోవాల్సిన అవస రం ఉందని అన్నారు. పామ్ ఆయి ల్ వృద్దికి తాము అన్ని విధా ల సహా య సహకారాలు అందిస్తు న్నామని, ఆ దిశలో త్వరలోనే వారి బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని తెలియజేసారు.
పర్యటనలో భాగంగా తర్వాత వ్యవసాయశాఖ మంత్రి మాట్రోయి చైర్మన్ డాటో సెరి రీజల్ మెరికన్ గారిని కలిసి మలేషియాతో వ్యవసాయపరంగా గల వ్యాపార అవకాశాలపై (Business opportunities) చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఇండియాతో వ్యాపారాభివృద్ధికి తమదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది, వ్యాపార పరంగానే కాక ఇండియా తో తమకు సామాజికంగా, చారిత్ర కంగా కూడా బంధము ఉన్నదని తెలియజెస్తు, బ్రోకెన్ రైస్ కు తమ దేశంలో అత్యంత డిమాండ్ ఉందని తెలియజేయగా, మన రాష్ట్రం నుండి బ్రోకెన్ రైస్ సరఫ రాకు గల అవకాశాలను పరిశీలిం చి త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. వెంటనే మంత్రివర్యులు హెచ్ సిఎసి శ్రీ చంద్రశేఖర్ రెడ్డిని టెలిఫోన్ లో సంప్రదించి మన రాష్ట్రంలో బ్రోకెన్ రైస్ (Broken Rice) ఎగుమతి చేయడానికి, దానికి సంబంధించిన economics ను పరిశీలించి, మన వరి రైతులకు అదనపు ప్రయో జనం కలిగితే, వచ్చే యాసంగి కల్లా ఎగుమతి చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
సాయంత్రం పర్యటనలో భాగంగా మలేషియా పామ్ ఆయిల్ బోర్డును సందర్శించి, పామ్ ఆయి ల్ రంగంలో వాళ్ళ అనుభవాలను MPOB చైర్మన్ డా. అహ్మద్ పర్వేజ్ గులామ్ ఖాదీర్ పర్యటన బృందంతో పంచుకున్నారు. MPOB, ఆయిల్ పామ్ సాగులో ఒక నూతన ఒరవడిని సృష్టిం చిందని, అంతేగాక ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే ప్రాంతా లలో పంట విస్తరణకు కావాల్సిన సాంకేతిక సహాయం అందిస్తుందని మంత్రికి తెలియజేశారు.