కూలిన నిర్మాణంలోని లిఫ్ట్
— ఏడుగురు కూలీల దుర్మరణం
ప్రజా దీవెన/మహారాష్ట్ర: మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం వాటర్ ఫ్రూఫింగ్ పనిని పూర్తి చేసిన కూలీలు 40 అంతస్తుల నిర్మాణం నుండి దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
నిర్మాణ లిఫ్ట్‌లోని సపోర్టింగ్ కేబుల్స్‌లో ఒకటి పగలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని థానే డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం తెలిపింది. ఇది నిర్మాణ లిఫ్ట్ అoటూ ఎంతమాత్రం సాధారణ ఎలివేటర్ కాదని, ఇది 40వ అంతస్తు నుండి కూలిపోయి పార్కింగ్ ఏరియాలో భూగర్భంలో దిగిందని తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు వెంటనే స్థానిక అగ్నిమాపక శాఖ, పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వేగంగా స్పందించినప్పటికీ ఐదుగురు కార్మికులు అక్కడిక్కడే మరణించగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆ తర్వాత మరణించారు.ప్రస్తుతం లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.