Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Avishetti Shankaraiah: చేతివృత్తుల వృత్తి సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలు

Avishetti Shankaraiah: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నల్లగొండ ‌జిల్లా సదస్సు బుధవారం నాడు దొడ్డి కొమరయ్య భవన్లో అవిశెట్టి శంకరయ్య (Avishetti Shankaraiah) అధ్యక్ష తన జరిగింది . ఈ సదస్సులో వృత్తిదారులసమన్వయ కమిటీ జిల్లా నాయకులు బండ శ్రీశై లం ,జిల్లా కన్వీనర్ గంజి ము రళీ ధర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు (Central and State Governments) అవలంబిస్తున్న నూతన ఆర్థిక సరళీకరణ విధానాల వలన గీత, చేనేత గొర్రెలు మేకలు, మత్స్య, రజక, క్షౌర, కుమ్మరి, కమ్మరి ,వడ్రంగి కంసాలి, పూసల ,మేదర ,వడ్డెర, గంగిరె ద్దులు, కాటికాపర్లు, దూదేకు ల ,సంచార జాతులు బుడిగ జంగాలు, కాటికాపర్లు ,పొడపత్ర వృత్తిదారులందరూ వారి వారి వృత్తుల సమస్యలతో ప్రభుత్వ విధానాల కారణంగా గ్రామీణ ప్రాంతంలో చేతివృత్తులు కునా రిళ్ళిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి ఏ రాజకీయ పార్టీ వచ్చినా జెండాలు మారుతున్నాయి తప్ప వృత్తి దారుల బతుకులు మారడం లేదు. వృత్తిదారులకు సంక్షేమ పథకాల పేరుతో కోట్లల్లో బడ్జెట్ (Budget in crores) ప్రకటిస్తున్న ఆచరణలో ఊరుకో కోడి ఇంటికో ఇక అనే చందంగా ప్రకటించిన బడ్జెట్ను కూడా ఆచరణలో ఖర్చు చేయడం లేదు.వృత్తిదారుల విషయంలో వారి విధానాలు ఒకే రకంగా అవలంబిస్తూ పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తూ అన్ని వృత్తుల్లోకి బహుళ జాతి సంస్థలను పెట్టుబడిదారులను తీసుకొస్తున్నారని దీని కారణంగా గ్రామీణ ప్రాంతంలో వృత్తులు వదులుకొని వారి వద్ద ఉపాధి కోసం పనులు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు విభజించి పాలించే పద్ధతిని అవలంబిస్తూ అరకొర సంక్షేమ పథకాలు (Arakora welfare schemes) ఆశ చూపుతూ వృత్తుల ఐక్యతను దెబ్బతీస్తూ కులాల వారిగా వృత్తుల వారిగా విభజించి ఎన్నికల సమయంలో కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ మోసం చేస్తున్నారని అన్నారు.

మన వృత్తులను రక్షించుకోవాలంటే సంఘటిత ఐక్య ఉద్యమాల (United Movements)ద్వారానే ఈ ప్రభుత్వాల విధానాలను తిప్పి కొట్టాలని, నియోజకవర్గస్థాయిలో మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో వృత్తిదారుల సమన్వయ సదస్సులు నిర్వహించి పాలక ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ వృత్తిదారులను చైతన్యపరిచి పోరాటాల వైపు మళ్ళించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చౌగాని సీతారాములు అధ్యక్షులు కొండ వెంకన్న (Konda Venkanna ) , రాచకొండ వెంకన్న,చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్ ,రజక సంఘంజిల్లా అధ్యక్షుడు చెరుకు పెద్దలు ,కంసాలి స్వర్ణకారుల సంఘం రాష్ట్ర నాయకులు కర్ణ కంటి సత్యనారాయణ చారి, కుమ్మరి సంఘం నాయకులు చిట్టి మల్ల లింగయ్య ,గీత సంఘం నాయకులు జే ధనంజయ ,గోపాల్ సురుగల యాదయ్య, సత్తయ్య, వీరయ్య,చేనేత సంఘం నాయకులు గడ్డం దశరథ, లింగయ్య, శ్రీరంగం, మేదర సంఘం నాయకులు నోముల రవి క్షౌరసంగం నాయకులు కే అంజయ్యతదితరులు పాల్గొన్నారు.