*రైతుల సమక్షమమే ప్రభుత్వ లక్ష్యం
*రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం ఖరీదు చేస్తుంది
*దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు.
Vangaveeti Rama Rao: ప్రజా దీవెన ,కోదాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని దాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు (Vangaveeti Rama Rao) కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డిలు (Oruganti Srinivas Reddy) అన్నారు. బుధవారం పిఎసిఎస్ ఆధ్వర్యంలో కోదాడ మున్సిపల్ పరిధిలోని కొమరబండ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోదాడ తాసిల్దార్ వాజీద్ అలీ, వ్యవసాయ అధికారి రజినీ కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డితో (PACS Chairman Oruganti Srinivasa Reddy) కలిసి అయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు నాణ్యత, ప్రమాణాలు పాటించి ధాన్యం తీసుకొని వచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని తెలిపారు.
మద్దతు ధరతో పాటు సన్నపు ధాన్యాలకు 500 రూపాయలు బోనస్ పొందవచ్చు ధాన్యం 17% కుమించి కామ శాతం ఉండరాదని రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు (Grain buying centres) తీసుకువచ్చి విక్రించుకోవచ్చని అని తెలిపారు ఈ క్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ బుడియో నరేష్ స్థానిక కౌన్సిలర్ మామిడి పద్మావతి డైరెక్టర్లు గుజ్జు బాబు మమత వెంకటయ్య, పార్వతి, ప్రభాకర్ రావు ,శిరం శెట్టి వెంకటేశ్వర్లు, ఏసిఎస్ సీఈవో మందా వెంకటేశ్వర్లు, సిబ్బంది, రైతులుమామిడీరామారావు,కాసాని శివ, సీతయ్య, పట్టాభి ,బాలకృష్ణ, సాంబయ్య, రామారావు ,బత్తుల కృష్ణ, అనంత సైదయ్య, నాగుల మీర ,సైదులు, తదితరులు పాల్గొన్నారు