కేసిఆర్ మరో కీలక నిర్ణయం
— సెప్టెంబర్ 17న సమైక్యతా దినోత్సవం
ప్రజా దీవెన/హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా- సెప్టెంబర్ 17ను పరిగణిస్తూ ఘనంగా నిర్వహించేందుకు కెసీఆర్ ప్రభుత్వo కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని నిర్ణయించింది. ఆ రోజున నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
జిల్లా కేంద్రాల్లో సెప్టెంబర్ 17 న ఉదయం 9 గంటలకు నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు పాల్గొంటారు.