Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fake Ginger Garlic Paste : ప్రజల ప్రాణాలతో చెలగాటం.. హై దరాబాదులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగోతం

Fake Ginger Garlic Paste: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాదులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ భారీ మొత్తంలో దొరికింది. లంగ ర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధి లోని డిఫెన్స్ కాలనీలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు (Fake Ginger Garlic Paste) తయారు చేస్తున్న గోడౌన్‌పై కమిషనర్ టాస్క్‌ఫోర్స్ సౌత్ బెస్ట్ జోన్ బృందం దాడి చేసింది.నిందితుడు ఇమ్రాన్ సలీం కల్తీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. 835 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్ (Fake Ginger Garlic Paste) చేసినట్లు పోలీసులు తెలిపారు.ఎయిర్ కండిషన్ గ్రైండర్ మిషన్‌తో సహా అల్లం వెల్లుల్లి పేస్టు తయారీకి ఉపయోగించే వస్తువులను పోలీసులు (police) సీజ్ చేశారు. సుమారు నాలుగు లక్షలపైగా ఆ వస్తువుల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఎక్స్పైరీ అయిపోయినా, ఎలాంటి లేబుల్ లేకుండా హీనా బ్రాండ్ పేరుతో కలిసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్టోర్స్ రెస్టారెంట్లు హోటల్‌కు నిందితులు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. అయితే గతంలో కూడా హైదరాబాదులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Fake Ginger Garlic Paste) బాగోతం బయటపడింది

ఉప్పల్ పోలీస్ స్టేషన్ (Uppal Police Station) పరిధిలోని రామంతపూర్ లో 12 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. నాంపల్లిలోని అగాపురాకు చెందిన మహమ్మద్ అఫ్తాబ్ అనే వ్యక్తి రామంతపూర్లో ఐదేళ్లుగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తూ అధికారులకు పట్టుపడ్డాడు. ఇప్పటికే పట్టుబడినటువంటి వ్యక్తికి ఇది మూడోసారి.. సాధారణ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తుండడంతో బయటకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు నాలుగో సారి పట్టుబడడంతో మల్కాజ్‌గిరి ఎస్ఓటి అతనిని అరెస్టు చేశారు. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వారి మీద పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.