Are you getting ready to explore the sea: సముద్రం అన్వేషణకుసన్నద్ధమవుతున్నారా
-- చంద్రయాన్- 3 సక్సెస్ తో సముద్రయాన్ కు రెడీ -- జలాంతర్గామి మత్స్య-6000 సముద్రయాన్ కు తుది మెరుగులు
సముద్రం అన్వేషణకుసన్నద్ధమవుతున్నారా
— చంద్రయాన్- 3 సక్సెస్ తో సముద్రయాన్ కు రెడీ
— జలాంతర్గామి మత్స్య-6000 సముద్రయాన్ కు తుది మెరుగులు
ప్రజా దీవెన/న్యూఢిల్లీ: ప్రపంచంలో భారతదేశ ఖ్యాతి దశ దిశల వ్యాపింపజేసింది చoద్రయాన్-3 విజయవంతం కావడతోనే.. ఇదే స్ఫూర్తితో దేశం త్వరలో సముద్రయాన్‌ను చేపట్టేందుకు సన్నద్ధమవుతుంది. సముద్రయాన్ మిషన్ పేరుతో సముద్రం అడుగు ( Step into the ocean in the name of Samudrayan Mission) భాగానికి యాత్రను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది.
సముద్రయాన్ పేరుతో సముద్రం అడుగున 6 వేల మీటర్ల లోతుకు(6 thousand meters deep under the sea) జలాంతర్గామి పంపనున్నారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి మత్స్య-6000 సముద్రయాన్ కు తుది మెరుగులు దిద్దుకుంటుండగా ఆ సబ్ మెర్సిబుల్ ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
సముద్రపు లోతులను అన్వేషించే మానవసహిత సబ్ మెర్సిబుల్ మత్స్య 6000 నౌకను( Matsya 6000 is a manned submersible deep-sea exploration vessel) చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. ఇది దేశంలోనే మొట్టమొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్. ఆక్వానాట్‌లను సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లేందుకు గోళాకార సబ్ మెరైన్ ను నిర్మిస్తున్నారు.
ఇది మొదటగా 500 మీటర్ల మేర నీటి అడుగులకు ప్రయాణం చేయనుంది. ఈ మిషన్ కారణంగా సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు ( The mission will not cause any damage to the ocean floor environment). మత్స్య-6000 జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు ప్రయాణించవచ్చు.
దీని ద్వారా సముద్ర వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం జరపవచ్చు. సముద్ర అడుగు భాగంలోకి కోబాల్డ్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలు, ఖనిజాల గురించి అన్వేషించనుంది(It will search for precious metals and minerals like cobalt, nickel and manganese in the seabed) . 2024 లేదా 2025లో చెన్నై తీరంలో బంగళాఖాతంలోకి ముగ్గురు ఆక్వానాట్స్‌ను మత్స్య 6000 ద్వారా పంపేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే మానవసహిత సబ్‌లను అభివృద్ధి చేశాయి. మత్య్స పూర్తయితే ఈ జాబితాలో భారత్ కూడా చేరనుంది.