Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Central conspiracies to kill democracy: ప్రజాస్వామ్యం ఖూనీకి కేంద్రం కుట్రలు

- జమిలి ఎన్నికల పేరుతో గందరగోళం సృష్టిస్తోంది -- సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుoదాం -- నల్లగొండ మీడియా సమావేశం లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజాస్వామ్యం ఖూనీకి కేంద్రం కుట్రలు

— జమిలి ఎన్నికల పేరుతో గందరగోళం సృష్టిస్తోంది
— సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుoదాం
— నల్లగొండ మీడియా సమావేశం లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజా దీవెన/ నల్లగొండ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల పేరిట దేశంలో రాజకీయ గందరగోళానికి తెర తీసిందని విమర్శించారు. నల్లగొండలో ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

ఎన్నికల నియమావళి షెడ్యూల్ ప్రకారం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహించాల్సి ఉన్నా జమిలి ఎన్నికల పేరిట అంతర్గత కుట్ర కొనసాగుతుందని దుయ్యబట్టారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలే ప్రామాణికంగా బిజెపి ముందుకు పోతుందని ఆరోపించారు.

SEP 17వ తేదిన జాతీయ సమైక్యత దినోత్సవాన్నీ పెద్ద ఎత్తున జరుపుతామని, వేడుకల్లో ప్రజలు వెల్లువలా పాల్గొనాలని కోరారు.
ఆ రోజు మరోసారి అమరులను స్మరించుకుందామని సూచించారు. రాష్ట్ర భవష్యత్తు కోసం తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి ని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా BRS ని గెలిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కేసీఆర్ మంత్రివర్గంలో ద్రోహులు ఉన్నారని అంటున్న కాంగ్రెస్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ లో ఇవ్వాళ తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు చేరారని వివరించారు. వైయస్ షర్మిల కూడా కాంగ్రెస్ లో చేరుతుందని,షర్మిల తెలంగాణా వ్యతిరేకి కాదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ విశ్వ నగరం గా రూపు దిద్దుకుందంటే కేవలం కేటీఆర్ కృషి వల్లనే అని తెలిపారు. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలవి పగటి కలలే అని, BRS వల్లనే సుస్థిరమైన పాలన ఉంటుందని వెల్లడించారు.