Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Paladugu Prabhavati: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉదృతపోరాటాలు

Paladugu Prabhavati: ప్రజా దీవెన, గుర్రంపోడు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలని, అందుకు సిపిఎం కార్యకర్తలు తమ చివరి శ్వాస వరకు దోపిడీ పీడన నుంచి పీడిత ప్రజలను విముక్తి చేసేంత వరకు పోరాడాలని సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి (Paladugu Prabhavati) సిపిఎం కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలో సిపిఎం మూడవ మహాసభలు ఘనంగా జరిగినవి. మహా సభల సందర్భంగా అమరుల చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభావతి (Paladugu Prabhavati) మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రజా సమస్యల పరిష్కరించకుండా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని కులమత (caste)ప్రాంతాలతో సంబంధం లేకుండా అణగారిన వర్గాలను దోపిడీ పీడన నుంచి విముక్తి చేయడానికి ప్రతి సిపిఎం కార్యకర్త తన చివరి శ్వాస వరకు పోరాడాలని ఆమె అన్నారు.

పాలకులు ఎవరు అధికారంలోకి వచ్చిన తమ పెట్టుబడి దారి పంథాను మార్చుకోరని, వ్యవస్థలో అసమానతలు ఉండాలని కోరుకోవడం పెట్టుబడిదారీ విధానం సహజ లక్షణం అని అన్నారు. సిపిఎం (cpm)కార్యకర్తలు మతోన్మాదాన్ని ఆర్థిక సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా రెండింటిని మేళవించి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. నిర్బంధాలు ఆటంకాలు ఎన్ని ఎదురైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి కార్యకర్త అకుంఠిత దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంలో బిజెపి పాలనలో చట్టబద్ధ, రాజ్యాంగ బద్ధ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని అన్ని వ్యవస్థల్లోకి రాజకీయ జోక్యం పెరిగి విజ్ఞాన శాస్త్రం వెనకకు వెళుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచానికి ఉత్పత్తిదారు ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని దిగుమతులపై ఆధారపడి వినియోగదారి ఆర్థిక వ్యవస్థగా మార్చారని విమర్శించారు. ఐక్యరాజ్యసమితి సహ అనేక అంతర్జాతీయ సంస్థలు (International organization_దేశ తిరోగమనాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న బిజెపి పాలకులు నిరంకుశంతో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు.

దేశ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ పాలన కేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని విమర్శించారు. బిజెపి విధానాలపై ప్రాంతీయ పార్టీలు మేలుకొనకపోతే భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వర్తమాన ప్రపంచానికి కమ్యూనిస్టు పార్టీల అవసరం ఉందని అధికారంలో ఉన్న లేకున్నా పీడిత ప్రజల వైపు పోరాడేది ఎర్రజెండా లేనని అన్నారు. కమ్యూనిస్టులు బలహీన పడటం అంటే పీడిత ప్రజల తమ ప్రశ్నించే హక్కును కోల్పోవడమేనని అంతరాల లేని సమాజం కోసం నిరంతరం పరితపిస్తున్న కమ్యూనిస్టు ఉద్యమాలకు ప్రజలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో సిపిఎం మండల కార్యదర్శి వనమాల కామేశ్వర్ బచ్చనబోయిన శివ, గుండెబోయిన మల్లయ్య, ముడుసు లాలయ్య, తగుల్లా ఈదయ్య, సర్వయ్య, సిపిఎం కార్యకర్తలు హాజరయ్యారు.