Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: తాటి, ఈత చెట్లు నరికిన వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలి

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గీతకార్మికులకు జీవనాధారమైన తాటి, ఈత చెట్లు నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవా లని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి (Narayana Reddy) కి పానగల్లు సొసైటీ కల్లుగీత కార్మికులతో కలిసి తాటి చెట్లు ఈత చెట్లు నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవా లని వినతి పత్రం సమర్పించడం జరిగినది.

ఈ సందర్భంగా కొండ వెంకన్న(Koṇḍa veṅkanna) మాట్లాడుతూ పానగల్లు కాటమయ్య గుడి సర్వేనెంబర్ 1117 11 2018 1119 సర్వేనెం బర్ లో గల సుమారు 120 తాటి చెట్లను 60ఈత చెట్లను అక్టోబర్ 25వ తేదీన కొండ లక్ష్మయ్య అనే భూ యజమాని ఎలాంటి సమా చారం లేకుండా నరికి వేయడం జరి గిందని దీనితో తాటి చెట్లు, ఈత చెట్లు (Palm trees, swimming trees) గీసుకొని వాటిపైనే ఆధా రపడి బ్రతుకుతున్న సుమారు60 కల్లుగీత కార్మిక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తుం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాం టి సమాచారం లేకుండా చెట్లు నరికిన సదరు వ్యక్తి పైన క్రిమినల్ చర్యలు తీసుకోనీ ప్రతి కుటుంబా నికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు.

ఈ కార్యక్ర మంలో పానగల్ గీత కార్మిక సంఘం (Panagal Gita Labor Union) సొసై టీ అధ్యక్షులు జెర్రిపోతుల యాద య్య, ప్రధాన కార్యదర్శి గుండగోని జానయ్య ఉపాధ్యక్షులు గుండెగోని సత్తయ్య.చెనగోని యాదగిరి గౌడ్ గీత కార్మికులు కొప్పుల సత్తయ్య, ఉయ్యాల జానయ్య, కసగుని వీరయ్య. ఉయ్యాల సైదులు.రావులనాగయ్య.కొప్పు ప్రవీణ్ కసాగుని శ్రావణ్ కొండ వంశీ కొండ యశ్వంత్. జానకి రాములు, ఉయ్యాల సైదులు, రావుల నాగయ్య, మీనయ్య, గుండ గొని వెంకన్న, గుండెగోని రాజు, కసగోని సైదులు, గుండెగోని శ్రీను, పోగుల బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు