Journalist attacks: ప్రజా దీవెన, కోదాడ:జర్నలిస్టులపై (Journalist attacks) జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు (Padishala Raghu)అన్నారు. గత కొన్ని రోజుల క్రితం హుజూర్నగర్ నియోజకవర్గ పాలకీడు మండల కేంద్రం జాన్ పహాడ్ దర్గా వద్ద జర్నలిస్టు 6టీవీ రిపోర్టర్ వెచ్చ సందీప్ పై జరిగిన దాడిని మంగళవారం ఆయన తీవ్రంగా ఖండించారు
. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాన్ పహాడ్ దర్గా వద్ద సందీప్ పై విచక్షణారహితంగా కత్తులతో దాడి (attack)చేసి అత్యాయత్నానికి పాల్పడడం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకు భయాందోళనకు గురి చేసిందని తెలిపారు ప్రజా సమస్యలపై పోరాడే జర్నలిస్టులపై ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే, ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు . ప్రశ్నించే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు.