Tripathi: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను (survey)పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Tripathi) అన్నా రు.మంగళవారం ఉదయాదిత్య భవన్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ ,కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
శిక్షణ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు (Master Trainers) అన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని, శిక్షణలో నేర్చుకున్న విషయాలను మండల స్థాయిలో ఎన్యుమరేటర్లకు తెలియజేయాలని చెప్పారు. జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ (Social, economic, educational, employment, political)మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్వే పారదర్శకంగా ఉండాలని, సర్వే విషయాలను గోప్యంగా ఉంచాలని, ఎలాంటి తప్పులు లేకుండా సర్వే పక్కగా చేయాలని, ఏ ఒక్క విషయం తప్పిపోకుండా అన్ని వివరాలు సేకరించాలని తెలిపారు. వివరాల సేకరణ అనంతరం డేటా ఎంట్రీ సైతం పక్కాగా నిర్వహించాలని చెప్పారు. సర్వే సందర్భంగా అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని తెలిపారు.
అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ,సిపిఓ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, ఇతర అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.