ఎంజియూ రిజిస్ట్రార్ గా ఆచార్య అల్వాల రవి
ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ( ma hat hma gandhi university) మే నేజ్మెంట్ విభాగం అధ్యా పకులు ఆ చార్య ఆలువాల రవికి పూర్తి బాధ్యతల రిజిస్ట్రార్ ( reg istrar) గా నియమిస్తూ ఉప కులపతి ఆచార్య ఖాజా ఉత్తర్వులు జరిచేసారు. ఈ సందర్భంగా ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ ( vc altha af) మాట్లాడుతూ ప్రతి అవకాశాన్ని బాధ్య తగా స్వీకరించి అంకిత భావంతో పనిచేసి విశ్వవిద్యాలయ అభి వృద్ధికి పాటుపడాలని సూచించారు.
మొట్టమొదటిసారి ఎం జియూ అధ్యాపకునికి అవకాశం రావడం, ఆది నుండి పాలన వ్యవ హారాల్లో చురుకైన పాత్ర ( Active role in governance affairs) పోషించడం, సమస్యలపై పూర్తి స్థా యి అవగాహన ఉన్న దృష్ట్యా మరింత బాధ్యతగా ముందుకు సాగా లని సూచించారు. నల్లగొండ జిల్లా వాస్తవ్యులు అయిన ఆచార్య అల్వాల రవి ( alval a ravi) , నిరు పేద కుటుంబం నుండి వచ్చి అక్షరాన్ని ఆలంబనగా చేసుకొని తను తాను మలుచుకుంటూ ఆచార్యుడిగా ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకం.
సర్వేల్ (sarvel) సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యనభ్య సించి, అటు పిమ్మట ఎన్జీ కళాశాల నల్లగొండలో పట్టభ ద్రుడై, ఎంబీఏ మరి యు పిహెచ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందారు. ఎంజియూలో నియామకం తర్వాత కామర్స్ అండ్ బిజినెస్ మేనే జ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ( principal )గా, ఆడిట్ సెల్ డైరెక్టర్ గా, మరియు ఉపకులపతి యొక్క ప్రత్యేక అధి కారిగా, ఇంచా ర్జ్ రిజిస్ట్రార్ ప్రస్తుతం సేవలందిస్తున్నారు.
ఆచార్య అల్వాల రవి యొక్క పర్యవేక్షణలో నలుగురు పీహెచ్డీ పూర్తి చేశారు. ఆన్లైన్ పేమెంట్ విధానంపై రవి ఒక పేటెంట్ హక్కును కలిగి ఉన్నారు. ఆచార్య రవి ఇప్పటివరకు ఆరు పుస్తకాలు రచించి, నాలు గింటికి సంపాదకత్వO, 20 కు పైగా సిద్ధాంత పత్రాలను వివిధ సెమి నార్లలో సమర్పించారు. నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవల ప్మెం ట్ శాశ్వత సభ్యునిగా, ఐసెట్, ఎడ్‌సెట్, ఎంసెట్ కో కన్వీ నర్ గా, యుజి సి ( UGC) అటానమస్ కమిటీ కళాశాల సభ్యునిగా కొనసాగుతు న్నారు.
సామాజిక స్పృహ కలిగి విద్యార్థుల సర్వతో ముఖాభివృ ద్ధికి అనుని త్యం కృషి చేస్తూ, వ్యక్తిగత పరిచయాలను అనుసంధానం చేస్తూ, వివిధ సంస్థ లతో అవగాహన ఒప్పందాలకు చొరవ చూపి విశ్వవి ద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సంజీవిని ట్రస్ట్ ( sanje evini trust ) ద్వారా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం, కామి నేని వైద్య కళాశాల మరియు బెటాలియన్ తో అవగాహన ఒప్పం దాలు, వివిధ శాఖలకు బంగారు పథకాలు మరియు పీఠాల ఏర్పా టుకు విశేషంగా కృషి చేశారు.
ఆది నుండి విధాన పరమైన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ విశ్వవిద్యాలయ సర్వతో ముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న తమ సహాధ్యాపకుడి సేవలు గుర్తించి పూర్తిస్థాయి రిజి స్ట్రార్ గా నియమించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్లు డా ప్రేమ్‌సాగర్ అరుణప్రియ , డా మారం వెంకటరమణారెడ్డి, సుధారాణి, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఉపేందర్ రెడ్డి, డా మిరియాల రమేష్, డా దోమల రమేష్ తదితర అధ్యాపకులు అధికారులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు .
mahathmagandhi university