సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త వహించoడి
ప్రజదీవెన, నల్గొండ క్రైమ్: సైబర్ జాగరుకత దివాస్ కార్య క్రమంలో భాగంగా పట్టణ కేంద్రంలోని సీని యర్ సిటిజెన్,రిటైర్ ఉద్యోగులకు డిజిటల్ అరె స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రా డ్స్, ఇంపర్షులేషన్ వంటి సైబర్ నేరాలపై ( cyber crime) సైబర్ క్రైమ్ డియస్పి లక్మినారాయణ అవగాహన కల్పించారు.
ఈ సైబర్ నేరాలు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీనీ ( te chonology) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అనేక అ మాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఇందులో భాగంగానే తెలం గాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ( shikh a ghoyal) ఆదే శాల మేరకు సైబర్ నేరాలను అరి కట్టడానికి ప్రతి నెల మొదటి బుధవారం సైబర్ జాగురుకత దివాస్ పేరుతో మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాల గురించి అవగా హన (Aw areness of cyber crime) కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాగరూక్ సీనియర్ సిటిజెన్ కార్యక్రమం పేరుతో సైబర్ క్రైమ్ డియస్పి లక్ష్మీనారాయణ ఆద్వర్యంలో అవ గాహన కార్యక్రమం నిర్వహించ డం జరిగింది.ఈ సందర్భంగా డియస్పి మాట్లాడుతూ సైబర్ క్రైమ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎదు ర్కొంటున్న అతి పెద్ద సమస్య అని, సైబర్ నేరాలకు అనేక మంది గురి అవుతున్నరు. సైబర్ నేరగాళ్లు మన చుట్టూ జరు గుతున్న వివి ధ రకాల ప్రభుత్వ స్కీమ్స్ ( gove rment sche mes), నఖిలి కరెం ట్ బిల్, ఆన్లైన్ లో కొరియర్, లోన్ యాప్ మరి యు వివిధ రకాల ఏపీ కే ఫైల్స్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను సైబర్ బాధితులుగా చేస్తున్నారన్నారు.
డిజిటల్ ( digital) అరెస్ట్ పేరుతో గుర్తు తెలియని, కొత్త ఫోన్ నెం బర్ ల నుండి పరిచిత వ్యక్తి వీడియో కాల్ చేసి, వీడియో రికార్డు( video recordings) చేసి బెదిరించడం, పోలీసు అధికారు లం, కస్టమ్స్ అధికారులమని కా ల్స్ వస్తే భయద పడవద్దని, ఏ పోలీసు అధికారి వీడియో కాల్ చేయరని గుర్తించాలన్నారు. సోష ల్ మీడి యాలో ఏదైనా కొత్త లిం క్( new link) ఓపెన్ చేసే ముందు ఒకటి కి, రెండు సార్లు చెక్ చేసుకో వాలని, కొరియర్, పార్సిల్ పేరుతో వచ్చి న కాల్స్ కు ఓటీపీ ( OTP ) చెప్పారాదని అన్నారు.
ఆన్లైన్ లో అపరిచి తులతో( strangers online) పరి చయాల కు దూరంగా ఉండాలన్నా రు. సైబర్ నేరగాళ్లు మారువేషంలో పొం చి ఉంటారాని గుర్తించాలన్నారు. సైబర్ మోసాల నుండి తప్పించుకో వడానికి అవగాహన ఒక్కటే మార్గమని, సైబర్ నేరాల గురించి అవ గాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసా లకు గురిఅయినట్ల యితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, NC RP పోర్టల్ https:// www. cybe rcrime.gov.in/ నందు లాగిన్ అయి ఫిర్యాదు నమోదు చేయాలన్నారు.
Cyber criminals