Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

A new type of fever in AP: ఏపీ లో ఎంటరైన కొత్తరకం జ్వరం

-- అనoతపురంలో తొలి మరణం నమోదు

ఏపీ లో ఎంటరైన కొత్తరకం జ్వరం

— అనoతపురంలో తొలి మరణం నమోదు

ప్రజా దీవెన/ అనంతపురం: దేశంలో నిఫా వైరస్, డెంగ్యూ డెన్ 2 కేసులు పెరుగుతున్న సమయంలోనే స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం ( A new type of fever called scrub typhus) కలకలం రేపింది. పక్క రాష్ట్రం ఒడిశాలో ఐదుగురు, అక్కడెక్కడో హిమాచల్‌ ప్రదేశ్‌లో 9 మంది మరణించిన ఈ మహమ్మారి తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడిప్పుడే పాకుతోంది.

ఇప్పుడప్పుడే మన ప్రాంతానికి రాదని అనుకుంటుండగానే తెలుగు రాష్ట్రాల్లో తొలి మరణం( First death in Telugu states)  నమోదయింది. ఒడిశాలో కలకలం రేపిన ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీలో అడుగుపెట్టింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం (Dharmavaram mandal of Anantapur district)  పోతుకుంట గ్రామానికి చెందిన యువకుడు గవ్వల మధు(20) ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

గ్రామానికి ప్రత్యేక బృందం వెళ్లి యువకుడు స్క్రబ్ టైఫస్ వ్యాధితో చనిపోయినట్లు నిర్దారణ( The youth was confirmed to have died of scrub typhus)  కు వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులను ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు అధికార యంత్రాంగంలోనూ ఇటు ప్రజానీకంలోనూ భయాందోళనలు నెలకొన్నాయి.