Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddy venkatreddy : అధికారులపై దాడులు అమానుషం, ఎవరినీ ఒదిలిపెట్టం 

--జిల్లా కలెక్టర్ తో పాటు మెజిస్ట్రేట్ అయిన అధికారిపై దాడులా --బిఆర్ఎస్ నేతల బరితెగింపుతోనే ఇలాంటి దాడులు --ముంచుకొస్తోన్న కేసుల ఒత్తిడితో నే బిఆర్ఎస్ ప్రోత్సహిస్తోంది --దాడి చేసిన వారు ఎంతటి వారై నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు --రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అధికారులపై దాడులు అమానుషం.. ఎవరినీ ఒదిలిపెట్టం 

–జిల్లా కలెక్టర్ తో పాటు మెజిస్ట్రేట్ అయిన అధికారిపై దాడులా
–బిఆర్ఎస్ నేతల బరితెగింపుతోనే ఇలాంటి దాడులు
–ముంచుకొస్తోన్న కేసుల ఒత్తిడితో నే బిఆర్ఎస్ ప్రోత్సహిస్తోంది
–దాడి చేసిన వారు ఎంతటి వారై నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
–రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ: కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ పై దాడి చేయడం అమానుషమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( minister koma tire ddy venkatreddy) పేర్కొన్నా రు.దాడి చేసి న వారిని ఎంతటి వారినైనా వదిలి పెట్టమని, దాడికి ప్రోత్సహించిన బిఆర్ఎస్ ( brs ) పార్టీ నాయకులను, పాల్గొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేద ని స్పష్టం చేశారు. నల్లగొండ లో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు.

అధికారం కోల్పోవడంతో ప్రెస్టేషన్ ( frustration) లో బిఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారని, దాడికి పాల్పడిన నేతలు ఫోన్లో కేటీఆర్ ( ktr) తో కూడా టచ్లోనే ఉన్నారని ఆరోపించా రు. భవిష్యత్తులో ఇలాంటి సంఘట నలు పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వారి పై కఠిన చ ర్యలు తీసుకుంటామని, ఫోన్ ట్యాపింగ్ ( phonetapping) లో ఉన్న వాళ్లు జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు.

ఫోన్ టైపింగ్ కేసులో ఉన్న వారు ఎక్కడ దాక్కున్న రాష్ట్రానికి రప్పిం చి జైలుకు (jail) పంపిస్తామని చెప్పారు. ప్రజాస్వా మ్య పద్ధతిలో నిరసనలు చేయవచ్చు, కానీ కలెక్టర్ (collector) పై దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా కేటీఆర్ ఫస్ట్ స్టేషన్ లో ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి ఉందని తెలిపారు.

ఆర్బిఐ ( rbi ) అనుమతి లేకుండా విదేశాలకు నగదు తరలించిన కేసులో గవర్నర్ ( governor) అనుమతి రాగానే అరెస్టులు ప్రా రంభమైతా యని చెప్పారు. మేధావులందరూ (intellectuals) ఒకసారి ఆలో చించాలని ఇటువంటి దాడులను ముక్తకంఠంతో ఖం డించాలని పిలుపునిచ్చారు. ఇలా ఉంటే దాడులు చేసిన రైతుల ( formers) పోరాటానికి మద్దతు ప్రకటిస్తామని కేటీఆర్ ప్రకటిం చడం హాస్యాస్పదంగా ఉందని రెచ్చగొట్టడం దాడులు చేయించడం మీకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు.

అరెస్టు చేస్తే యోగా చేస్తా ఆ తర్వాత పాదయాత్ర చేస్తా అని కేటీఆర్ అనడం సిగ్గుచేటు అ న్నారు. కలెక్టర్ పై దాడి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్య వహరి స్తుందని 50 మందిలో ఇప్పటికే 16 మందిని అరెస్టు చేయడం జరిగిందని వివరించారు.

బ్లాక్ మెయిల్ చేస్తున్న కొందరు మిల్లర్లు... నల్లగొండ ఉమ్మడి జిల్లా లో కొందరు రైస్ మిల్లర్లు ( rice millars) బ్లాక్మెయిల్ చేస్తూ రైతు లను ఇబ్బందులకు గురిచే స్తున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్ల గొండ ( nalgonda) జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొందరు రైస్ మిల్లర్ల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ధ్వజ మె త్తారు. వారం రోజులలో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తూ రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందుల గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొందరు మిల్లర్లు ప్రభుత్వాన్ని సైతం బ్లాక్ మెయిల్( blokmail) చేసే స్థాయికి చేరుకున్నారని ఇది కచ్చితంగా రైస్ మిల్లర్ల బరితెగింపుగా (Stripping of ricemillers) అభివ ర్ణించారు.రైతులకు సం పూర్ణంగా సహకరిస్తే సరిలేదంటే మిల్లర్లపై ఎస్మా ప్రయోగించే పరి స్థితి వస్తుందని స్పష్టం చేశారు.

ముగ్గురు మంత్రులుoడి నోరు మెదపడం లేదు…రాష్ట్రంలో ముగ్గు రు కేంద్ర మంత్రులు ఉన్న ప్పటికీ పత్తి కొనుగోళ్ళ (Purcha se of cotton) పై నోరు మెదపడం లేదన్నారు. కేంద్రంలో బిజెపి ( bjp) అధికారంలో ఉన్నప్పటికీ కనీసం పత్తికి మద్దతు ధర గురించి కేంద్రo మాట్లాడటం లేదన్నారు. మూసి ప్రక్షాళను( musi cleaning) అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు తప్ప రైతుల గురించి మాట్లా డటం లేదన్నారు.

నాగార్జున సాగర్ ప్రాంతంలో ఇప్పు డిప్పుడే రైతులు వరికోతలు ప్రా రంభించారని,రైస్ మిల్లర్లతో మాట్లాడి రైతు లకు ఇబ్బందులు లేకుం డా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మీడియా సమావే శంలో నాయ కులు వంగూరి లక్ష్మయ్య, బాబా, వేణుగోపాల్ రెడ్డి, గోగుల శ్రీనివాస్ యాదవ్, వంగాల అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.

Minister komatireddy venkatreddy