Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

An innovative scheme for students: విద్యార్థుల కోసం వినూత్న పధకం

-- పాఠశాల విద్యార్థులకు అల్పాహారం --ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలు -- దసరా నుంచి అమలుకు వెలువడిన ఉత్తర్వులు

విద్యార్థుల కోసం వినూత్న పధకం

— పాఠశాల విద్యార్థులకు అల్పాహారం
–ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలు
— దసరా నుంచి అమలుకు వెలువడిన ఉత్తర్వులు

ప్రజా దీవెన/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వo తెలంగాణలో మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకుoటూ
దసరా కానుకగా ( Taking a historic decision
As a Dussehra gift) అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 1 వ తరగతి నుంచి నుంచి 10 వ తరగతుల వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం ( Chief Minister’s Breakfast Scheme) అందించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు.

తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా అడుగులు పడ్డాయి. ఉదయాన్నే వ్యవసాయం పనులు కూలీపనులు చేసుకోవడానికి వెల్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సిఎం కేసీఆర్ మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహారం పథకాన్నిరాష్ట్ర ప్రభుత్వం దసరానుంచి అమలు చేయనున్నది. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.