Telangana Bc commission : బీసీల హక్కుల పరిరక్షణకే బీసీ కమిషన్
--రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపి శెట్టి నిరంజన్
బీసీల హక్కుల పరిరక్షణకే బీసీ కమిషన్
–రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపి శెట్టి నిరంజన్
ప్రజా దీవెన, నల్లగొండ:సమాజంలో వెనకబడిన బలహీనవర్గాల ప్ర జలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి అవకాశాలు కల్పించేందు కు ఆస్కా రం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ (BC Commission Chairman Niran jan) అన్నారు. సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా లో వెనుకబడిన తరగతుల సామా జిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు, వెనుకబా టుతనం, వారికి కల్పించాల్సిన అవకాశాలు తదితర అంశాలపై అ ధ్యయనం నిమిత్తం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాల యావరణలోని ఉదయాదిత్య భవన్ లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ (Pub lic hearing) చేప ట్టింది. ఇందులో భాగంగా వివిధ కుల సంఘా లు, వ్యక్తులు, సంస్థల తో విజ్ఞాపనాలను స్వీకరించారు.
అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల పరిస్థితులను తెలుసుకొని వారి హక్కుల రక్షణ (Prote ction of rights) కో సం కృషి చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహిస్తు న్నదని, ఇప్పటివరకు 5 విచారణ లు పూర్తి చేయగా, ఇది 6 వ దని అన్నారు. ఈ నెల 26 వరకు కమి షన్ బహిరంగ విచార ణలు ఆయా జిల్లాల్లో కొనసాగుతాయని చెప్పా రు.బీసీ హక్కుల పరి రక్షణ కోసం బీసీ కమిషన్ పనిచేస్తుందని, బిసి కమిషన్ ఈ విష యంలో ముక్కు సూటిగా వ్యవహరిస్తుందని, బీసీ లపై ఎక్కడైనా దాడులు జరిగిన ట్లయితే చర్య తీసుకునెందుకైనా బీసీ కమిషన్ వెనకాడదని తెలిపారు.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయం(A comprehensive caste survey is historic) అని, దీని వల్ల రాష్ట్రంలో జనాభాలో బిసిలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంద న్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో కోటి 15 లక్షల పైచిలుకు కుటుం బాలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించడం జరిగిందని, ఇందులో 87,000 మంది ఎన్యుమరేటర్లు (Enumerators) ఇప్పటివరకు ఇండ్లకు వెళ్లి సమాచారాన్ని సేకరి స్తున్నారని, సమగ్ర కుటుంబ సర్వే వివరా లు పూర్తిగా పబ్లిక్ డొమైన్ (Public domain)లో పెట్టడం జరుగు తుందని చెప్పారు. అయితే ఈ సర్వేపై కొందరు ప్రజల్లో అపోహ లు సృష్టిస్తున్నారని, సమాజంలో వెనుకబడి, బలహీనంగా ఉన్న వా రు ఎంత మందో తెలిస్తే మంచి అవ కాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
సమాజంలో బలహీనంగా ఉన్న వారి అభివృద్ధి కోరుకునే వారికి అం దరూ సహక రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటివరకు 65 నుండి 70% సర్వే పూర్తయిందని, నల్గొండ (nalgonda) జి ల్లాలో 5 లక్షల 4542 మంది కుటుంబాలకు గాను ఇప్పటివరకు 4 లక్షల ఇరవై వేల 954 కుటుంబాలను సర్వే చేసి 84% సర్వే పూర్తి చేయడం పట్ల ఆయన అభినందిం చారు. అదేవిధంగా యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో సైతం సర్వే బాగా నిర్వహిస్తుండడం పట్ల ఆ యా జిల్లాల యంత్రంగాలను (District machinery) అభినం దించారు.
సోమవారం నిర్వహించిన బహిరంగ విచారణ సందర్భంగా విశ్వ కర్మ ,బ్రాహ్మణ, పూసల, రజక, కు మ్మర, కమ్మరి ,ఉప్పర అన్ని కుల సం ఘాలు మజిలీస్, జమైతే ఇస్లాం ఇతర సంఘాల వారు వచ్చి వారి బాధలను, వారి కోరికలను విన్నవించుకున్నారని, రెండు సంవత్స రాల తొమ్మిది నెలల కాల పరిమితి లో బీసీ కమిషన్ బీసీలకు న్యా యం చేసేందుకు కృషి (Strive to do justice to the BCs) చేస్తుందని ఆయన తెలిపారు.
బీసీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ (Krimilayer) తొలగించాలని, ప్రమో షన్లలో బీసీ లకు రిజర్వేష న్లు కల్పించాలని, నాయి బ్రాహ్మణుల ను ఆలయాలలో ఉద్యో గులు గా గుర్తించాలని, బేస్తలను బీసీ ఏ నుండి ఎస్టీకి మార్చాలని, కుమ్మ రులకు చెరువు మట్టిని ఉచితంగా ఇవ్వాలని, ముదిరాజులు, కుమ్మ రి, బట్రాజ్ తదితర కులాలను బీసీ డీ నుండి ఏ కి మార్చాలని, రజ కులను ఎస్సీ లుగా గుర్తించాలని, పిచ్చ కుంట్లను పూర్తిగా ఆ పేరు పిలవడం మానేసి వంశరాజ్ గా మాత్రమే పిలవాలని విజ్ఞాపనలు వచ్చాయని వాటన్నిటి ని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించడం ( Reporting to Govt) జరుగుతుందని, బిసి కమిషన్ పై ఎలాం టి అపనమ్మకం అవసరం లేదని ఆయన తెలిపారు.
భువనగిరి శాస నసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడు తూ బిసి స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సామా జిక ఆర్థిక ఉపాధి రాజకీయ కులగణన తల పెట్టిందని, అనాది కా లం నుండి బీసీలు వివక్షకు గురవుతున్నారని, కుల వృత్తుల వారు ఇబ్బంది పడుతున్నారని, కొంతలో మార్పు వచ్చి నప్పటికీ ఇంకా మా ర్పు రావాల్సిన అవసరం ఉందని, కులవృత్తుల వారు కులాలు చేయ డం లేదని, దాంతో వారు ఉపాధి కోల్పోతు న్నారని,వీటన్నిటిని దృ ష్టిలో ఉంచుకొని బీసీల అభ్యున్నతికి బి సి కమిషన్ క్తుషి చేయాలని కోరారు.
ఉదయం బహిరంగ విచారణ ప్రారంభానికి ముందు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ( collector tripathi) మాట్లాడుతూ బీసీ కమి షన్ బహిరంగ విచారణకు అవస రమైన అన్ని సౌకర్యాలు క ల్పిండం జరిగిందని, ప్రత్యేకించి అఫిడ విట్ ఏర్పాటు చేయడంతో పాటు, జిరాక్స్, అన్ని సౌకర్యాలు కల్పించా మని తెలిపారు.యాదాద్రి భువనగి రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ బీసీ కులా లు, ఉప కులాల సమస్యలను విని పరిష్క రించేందుకు ఇప్పటివ రకు 5 జిల్లాలు తిరిగిన బీసీ కమిషన్ ( bc commission) సం ఘాలు, సభ్యు లు, వ్యక్తులు అందరికీ అవకాశం కల్పించడం జరు గుతుందని, అంద రూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లా డుతూ బీసీ కమిషన్ ప్రజల వద్దకు వెళ్లి బిసిల సమస్యలను ( bc’s pro bloms) ప్రత్యక్షంగా తెలుసు కొని వారి అభ్యున్నతికి కృషి చేయ డం చాలా సంతోషమని అన్నారు. తన స్వాగతోపన్యాసం లో బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ బీసీలకు అన్యాయం (Injustice to BC) జరగరాదన్నదే బీసీ కమి షన్ బాధ్యతని, ఈ బాధ్యత నెర వేర్చడానికి తాము ఎంతైనా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు సమ గ్ర కుటుంబ సర్వే పట్ల ఉన్న అపో హలను విడనాడి ఎన్యుమరేటర్లు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.
బీసీలలో ప్రస్తుతం చైతన్యం పెరిగిందని, సమాజంలో ఏ కులం వా రు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి మంచి అవకాశాలు కల్పిం చేందుకు అవకాశం ఉంటుందని ,దీంతో బీసీలకు మేలు చేసేందు కు అవకాశం ఉందని, ఈ విషయంపై క్షేత్రస్థాయిలో అవగాహన ( Aw areness in the field) కల్పిం చాల్సిన అవసరం ఉందని ఆయ న తెలిపారు. బీసీ కమిషన్ సభ్యు లు రాపోలు జయప్రకాష్, తిరు మలగిరి సురేందర్, బాలలక్ష్మీలు మాట్లాడారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొం డ జిల్లా బీసీ సంక్షేమ అధి కారి నిజాం అలీ, యాదాద్రి భువనగిరి ,సూర్యాపేట జిల్లా బీసీ సంక్షే మ అధికారులు అనసూయ, యాదయ్య తో పాటు వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు.
Telangana Bc commission