బ్రేకింగ్ న్యూస్…
టెట్ పరీక్ష లో మాల్ ప్రాక్టీస్
ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ పరీక్షా కేంద్రం లో మాల్ ప్రాక్టీస్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో టెట్ పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
సదరు కేంద్రం లో టెట్ పరీక్ష రాస్తున్న ఓ యువతికి ఇన్విజిలేటర్ మహమ్మద్ వారిస్ ముజని చిట్టిలు అదించారని అధికారులు గుర్తించి మాల్ ప్రాక్టీస్ పాల్పడిన ఇద్దరి పై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాల్ ప్రాక్టీస్ 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. కాగా ఇన్విజిలేటర్ మహమ్మద్ వారిస్ ముజని తిప్పర్తి పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.