Brs ktr : రైతుల పక్షాన పోరాటం చేసిన పాపానికి జైలుపాలు
--రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కా రణంగా చేయని తప్పుకు నరేంద ర్ రెడ్డి కి శిక్ష --చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎ మ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలి సి పరామర్శించిన కేటీఆర్
రైతుల పక్షాన పోరాటం చేసిన పాపానికి జైలుపాలు
–రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కా రణంగా చేయని తప్పుకు నరేంద ర్ రెడ్డి కి శిక్ష
–చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎ మ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలి సి పరామర్శించిన కేటీఆర్
ప్రజా దీవెన, హైదరాబాద్: పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి మా నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైల్లో చూసి పరామర్శించాల్సి వచ్చిందని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ విచారం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పట్నం నరేందర్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన తన గురించి కాకుం డా 30 మంది అమా యక రైతులను విడిపించాలని చెప్పారని గుర్తు చేస్తూ అందు కు ఆయనకు అభినందనలు తెలిపారు. శని వారం చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని కలిసి పరామర్శిం చిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లా డారు.
కొడంగల్ లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజు కొని అక్కరలేని ఫార్మా విలేజ్ ను బలవంతంగా రుద్దుతున్నారని, వారి కోసం పోరాటం చేయండని చెబుతూ బాధపడుతున్నారు. సంగా రెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకు లు జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరా చకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారు.
కొడంగల్ లో అర్ధరాత్రి పూట ఇళ్ల పై పడి మహిళలు, పిల్లలపై అరా చాకలు చేస్తూ పేద రైతుల భూ ములు గుంజుకుంటున్నారు.రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరె డ్డి అనే వ్యక్తి పై పగబట్టారు. రేవంత్ రెడ్డి కోసం ఆయన మొన్నటి ఎన్నికల్లో పనిచేశారు.కానీ ఆయన ఇంటికి అడ్డంగా గోడకట్టి తోవ లేకుండా చేశారు. ఆ క్షోభ, అవమానంతో ఆయన ఆత్మహత్య చేసు కున్నారు.నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి సంఘటన లు చూస్తుంటాం.
గతంలో మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఇలాంటి ఘటనల గురించి విన్నామా అని ప్రశ్నించారు. సొంత ఊరు, సొంత నియో జకవర్గ మైతే నీ సామ్రాజ్యమా, నువ్వు చక్రవర్తివా, వెయ్యి ఏళ్లు బత కటానికి వచ్చావా, సొంత ఊరు, సొంత నియోజకవర్గ మైతే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే కుదరదు. నువ్వు నియంత కా దు. నువ్వు చక్రవర్తి కాదు. నీలాంటి వాళ్లు చాలా మంది కొట్టుకు పోయారు. నువ్వు కూడా కొట్టుకుపోతావ్ అని తీవ్ర స్థాయిలో విరు చుకుపడ్డారు.
శిశుపాలుడి తప్పులను ఆనాడు లెక్కించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వ అ రాచకాలు, రేవంత్ రెడ్డి పాపాలను ప్రజలు ఇప్పుడు లెక్కిస్తున్నారు.
భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద, గిరిజన రైతుల కుటుంబాల మీద అర్థరాత్రి బందిపోట్ల మాదిరిగా పోలీసులు దాడి చేస్తున్నారని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని విచ్చ లవిడిగా దౌర్జన్యం చేస్తూ సాయి రెడ్డి, గురువా రెడ్డి లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశారు.
సొంత గ్రామంలో చేస్తున్న అరాచకాల పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. నీ కన్నా పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపో యారు. మా నేత నరేందర్ రెడ్డి చాలా ధ్యైర్యంగా ఉన్నాడు. పేద లు, గిరిజన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరాడు. మహబూబా బాద్ లో మేము చేప ట్టనున్న ధర్నా బాగా చేయాలంటూ మాకు ఉత్సాహానిచ్చారు.
నరేందర్ రెడ్డికి చేయని తప్పునకు జైల్లో ఉన్న 30 మంది అమాయక రైతుల కుటుంబాలకు ఒకటే చెబుతున్నాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుందని స్పష్టం చేశారు.రేవంత్ రెడ్డి మిమ్మల్ని నాలుగు రోజులు జైల్లో పెట్టవచ్చు. కానీ ఆయనకు మళ్లీ రాజకీయ జీవితం లేకుండా చేసే బాధ్యత మీ మీద ఉందని సూచించారు.
Brs ktr