Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm revanthreddy : రూ. 100 కోట్ల బదిలీ వద్దంటూ ఆదానికి లేఖ రాశాం

-- ఆదానీతో సహా ఏ సంస్థ నుంచి ఫండ్ తీసుకోలేదు --ప్రభుత్వoపై కొందరి ఆరోపణలు అవాస్తవం -- ఢిల్లీ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రూ. 100 కోట్ల బదిలీ వద్దంటూ ఆదానికి లేఖ రాశాం

— ఆదానీతో సహా ఏ సంస్థ నుంచి ఫండ్ తీసుకోలేదు
–ప్రభుత్వoపై కొందరి ఆరోపణలు అవాస్తవం
— ఢిల్లీ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిం చి ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివ ర్సిటీ కోసం కార్పస్ ఫండ్ కింద ప లు కంపెనీలు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, అం దులో భాగంగా అదానీ కూడా రూ.100 కోట్లు ఇచ్చేందుకు ముందు కు వచ్చారని తెలంగాణ ముఖ్యమం త్రి ఎనుముల రేవంత్ రెడ్డి( cm revanth reddy ) పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆదానీతో సహా ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫండ్ తీసుకోలేదని,
జరుగుతున్న వివాదాల నేపథ్యంలో అదానీ ఇస్తామన్న రూ.100 కోట్లు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని లేఖ రాశామ ని ,రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వా నికి బదిలీ చేయొద్దని లేఖలో పే ర్కొన్నట్లు తెలిపారు.

పక్క రాష్ట్రా ల్లో, పక్క దేశాల్లో అదానీ విషయం లో జరుగుతున్న వివాదానికి తెలం గాణకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒక సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదని, అందుకే అదానీ నుంచి రూ.100 కోట్లు తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూసి వివాదాస్పదం చేయవద్దని కోరుతున్నామ ని, అదానీ నుంచి నిధులు స్వీకరించారని రాష్ట్ర ప్రభుత్వంపై కొంద రు ఆరోపణలు చేస్తున్నారని, చట్టబద్ధంగా ఏదైనా అంశంలో పెట్టు డులు పెట్టేందుకు అందరికీ అవకాశాలు ఇవ్వాలనేది నిబంధనలని గుర్తు చేశారు.

 

నిబంధనల మేరకు టెండర్లను దక్కించుకున్న ఏ సంస్థలకైనా పెట్టుబ డులకు అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టంగా వివరించా రని గుర్తు చేశారు. ముఖ్యమం త్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సోమ వారం హైదరాబాదులో మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుది ళ్ళ శ్రీధ ర్ బాబు, పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నేను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి మీడియా మం త్రివర్గ విస్తరణ అంశాన్ని తెరపైకి తెస్తోందని, ఇవాళ్టి నా ఢిల్లీ పర్య టన ఓం బిర్లా కూతురు వివాహా నికి హాజరు కావడానికి మాత్రమే నని, ఈ పర్యటనకు రా జకీయ ప్రా ధాన్యత లేదని స్పష్టం చేశారు.మంగళవారం తెలంగాణ లోక్ సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సభలో లేవనెత్తాల్సిన అంశాలపై వారితో చర్చిస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తీసుకొచ్చేందుకు కావాల్సిన కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమ తుల కోసం రేపు అందు బాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలుస్తా మని, కొంతమంది అర్రాస్ పాటలా నా పర్యటనకు లెక్కలేస్తున్నారన్నారు. నేనేమీ మీలా మోదీ ముం దు మోకరిల్లాడానికి ఢిల్లీవెళ్లడం లేదని, ఎవరి కాళ్ళో పట్టుకోవ డానికో, కేసుల నుంచి తప్పించు కోవడానికో, గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని కోరేందుకో నేను ఢిల్లీ వెళ్లడం లేదని, గత పదేళ్లుగా తెలం గాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.

కేంద్రం నుచి నిధులు తెచ్చుకోవడం మన హక్కు అని, రాష్ట్రానికి రావా ల్సిన నిధులు బీజేపీతన ట్రెజరీ నుంచి ఏం ఇవ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచే ఇస్తుందని, రాజకీయ పక్షపాతం చూప కుండా వారిని వెళ్లి కలిసినపుడే నిధులు రాబట్టుకోగమని, ఇందుకో సం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళతామని స్పష్టం చేశారు.

మీ కడుపు మంట, దుఃఖం మాకు తెలుసు, మీ కాకి గోలను మేం పట్టించుకోమని, ఇది ఒకరిపై కోపం, పగ చూపాల్సిన సమయం కాదన్నారు. కార్యదీక్షతో తెలంగాణ అభివృద్ధి కోసం మేం ముందుకు వెళతామని, అదానీ ఫ్లైట్ లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు అని ఆరోపించారు. పెట్టు బడుల విషయంలో ఎవరికీ ఆయా చిత లబ్ది చేకూర్చమని, కేసీఆర్ లా మేం అదానీ నుంచి అప్పనంగా తీసుకోలే దన్నారు. ఆదానితో ఇన్ని ఒప్పందాలు చేసుకున్నవారూ మా పై ఆరో పణలు చేస్తున్నారని విస్మయo వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర నాందేడ్ లోక్ సభ ఎన్నికలో కాం గ్రెస్ గెలిచిందని, వయ నాడ్ లో ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చిం దని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఒకర కం గా కేంద్రానికి ఒకర కంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, దేశంలో ఎక్కడ చూసినా బీజేపీని తిరస్కరించార ని, బీజేపీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటు న్నారురో అర్ధం కావడంలేదన్నారు. ఆయన ఒక సైకో రామ్, సైకో రా మ్ గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదని ఎద్దేవాచేశారు.

Cm revanthreddy