చందుపట్లలో రాణి రుద్రమదేవి వర్ధంతి
–శిలాశాసనానికి పూజలు
ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో తెలంగాణ వీరవనిత రాణి రుద్రమ దేవి వర్ధంతిని వివేకానంద యువ జన మండలి ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించారు.ఈ సంద ర్భంగా గ్రామంలో గల రాణి రుద్ర మదేవి మరణ వివరాలు తెలిపే శాసనం వద్ద ప్రత్యేక పూజలు నిర్వ హించారు. రుద్రమదేవి చిత్రపటాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాణి రుద్రమ దేవి మర ణానికి సంబంధించిన శిలాశాస నాన్ని గ్రామంలో గుర్తించి నప్పటి నుంచి ప్రతియేటా నవంబర్ 27న రుద్రమదేవి వర్ధంతి నిర్వ హిస్తున్నట్లు యువజన సంఘం సభ్యులు, నాయకులు తెలిపారు.
రుద్రమదేవి నడియాడిన చందుపట్ల గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చే యాలని కోరారు. రుద్రమదేవి చరిత్రను భావి తరాలకు తెలియజే యాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్య క్రమంలో వివేకానంద యువజన మండలి సభ్యులు పోతు ల వెంకన్న, బెజ వాడ లక్ష్మినారాయణ, కోటగిరి రాధాకృష్ణ, పుట్ట రాకేష్, పుట్ట సాయికుమార్, కొల్లు వివేక్, చౌగోని రాజశేఖర్, బుడిగే మహే ష్, నా యకులు మల్గిరెడ్డి రంగారెడ్డి, సిలివేరు ప్రభాకర్, ఇమ డపాక వెంకన్న,పుట్ట సత్యనారాయణ, గొనె నర్సింహ్మ రావు, మాచర్ల సుద ర్శన్, దొరపెల్లి మధు, దిగ్గొజు వెంకటాచారి,కొత్తపెల్లి సైదులు, జిల్లా రమేష్,తాటికొండ రామ్మూర్తి, చందర్ రావు, ఆలకుంట్ల శంకర్, చింత మళ్ళ శ్రీను, నెలపట్ల శంకర్, పంది కృష్ణ ,సందీప్, సైదులు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Rani rudhramadevi