వై అర్పి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ
ప్రజా దీవెన/నల్లగొండ: వైఆర్పి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు యెలిశాల రవిప్రసాద్ ఆర్ధిక సహకారంతో శనివారం నల్లగొండ పట్టణం లోని పలు ప్రాంతాల్లో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షించేందుకు ఐదారు సంవత్సరాలుగా వినాయక మట్టి విగ్రహా లను పంపిణీ చేస్తున్నామని ఫౌండేషన్ ఆర్గనైజర్ యామ దయాకర్ తెలిపారు. అందరు మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి పూజిం చాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్.పి.కర్ణన్ పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద గల వైఆర్పి ట్రస్ట్ కార్యా లయం తో పాటు శివాజీనగర్ లోని కళ్యాణ మండపం, రామగిరి రామాలయం, పానగల్, ఫ్లైఓవర్, క్లాక్ టవర్, విటి కాలనీ పంచముఖ హనుమాన్ టెంపుల్ సెంటర్లలో 12 విగ్రహాలను పంపిణీ చేసినట్లు యామ దయాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు యెలిశాల రవిప్రసాద్, సభ్యులు యెలిశాల హేమచంద్ర, పారేపల్లి భరత్, మందాలపు శ్రీనివాస్, కోటగిరి రామకృష్ణ, కర్నాటి నగేశ్, కక్కిరెని లక్ష్మీ నారాయణ, నాగుబండి రామకృష్ణ, పల్లెర్ల సాయి తరుణ్, నెలంటి సాయి, బొల్లా వేంకటేశ్వర రావు, అర్రూరు పద్మ, విజయ, చంద్రకళ పాల్గొన్నారని తెలిపారు.