–జేఎన్టీయూ నూతన భవన నిర్మా ణానికి రూ. 108 కోట్లు విడుదల
ప్రజా దీవెన, పాలేరు : పాలేరు ప్రజలకు తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో తీపి కబురును అందించారు. ఆయన చొరవతో ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో జే ఎన్ టీ యూ నూతన భవన నిర్మాణానికి రూ. 108 కోట్ల 60 లక్షల రూపాయల నిధుల విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పాలేరు ఎమ్మెల్యేగా పొంగులేటి గెలిచి మం త్రి అయ్యి ఏడాది తిరగక ముందే ఈ జీవో వెలువడటం విశేషం.
తొలి ఏడాదిలోనే నియోజకవర్గానికి కా వాల్సిన అన్ని వసతులను సమ కూరుస్తూ రావడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యాటకం తదితర రంగాల్లో అన్ని నియోజక వర్గాల్లో కెల్లా పాలేరు నియోజక వర్గాన్ని అగ్రగామిగా నిలుపుతూ వస్తున్నారు. ఇదే తరుణంలో గత ప్రభుత్వంలో ఏళ్లుగా కలగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థుల కలను సాకారం చేస్తూ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం పట్ల పాలేరు ప్రజ లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.