ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :తమిళనాడు మాజీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత నేత డాక్టర్ కొ కొనిజేటి రోశయ్య మూడవ వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు ఇతర ప్రముఖులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ,ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు కోటగిరి దైవదీనం జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్, అదనపు కార్యదర్శి నాల్ల వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యలు , మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య తన జీవితం మొత్తం ప్రజలకు అంకితం చేశారని ప్రజాసేవలోనే గడిపారని 40 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నా కూడా ఎటువంటి మచ్చ లేకుండాఅజాతశత్రువు గా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.నిష్కలంక రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించారన్నారు. ఆశ్రిత పక్షపాతం బంధుప్రీతి లేకుండా పాలన కొనసాగించి రాజకీయాలకు వన్నెతెచ్చాడని కొనియాడారు. కేవలం తన స్వార్థం చూసుకోకుండా వైశ్య సమాజాన్ని కూడా అభివృద్ధి చేశాడని తెలిపారు.
అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభను సరిచేసి క్రమశిక్షణతో గ్రామ స్థాయికి విస్తరింపజేసి పటిష్టమైన సంస్థగా రూపొందించాడని తెలిపారు ఆయన మరణం రాష్ట్ర ప్రజలతో పాటు ఆర్యవైశ్యులకు తీరనిలోటని పేర్కొన్నారు. స్వర్గీయ రోశయ్య భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన నిర్దేశించిన లక్ష్యాలు ఆశయాలు మనముందు ఉన్నాయని వాటిని అమలు చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి సేవాదళ్ చైర్మన్ వీరెల్లి సతీష్ జిల్లా సంఘం మాజీ అధ్యక్షుడు వీరెల్లి కృష్ణయ్య మాజీ ప్రధాన కార్యదర్శి బుక్క ఈశ్వరయ్య .తో పాటు నాయకులు రేపాల భద్రాద్రి రాములు. నాంపల్లి నరసింహ. బోనగిరి ప్రభాకర్. నల్గొండ శ్రీనివాస్. నల్గొండ అశోక్. నల్గొండ సంతోష్ .వనమా రమేష్ .కర్నాటి వెంకటేశ్వర్లు. లకుమారపు శ్రీనివాస్. నల్గొండ సుమలత. తదితర ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.